తండ్రికి బాధ్యత లేకపోవడం, తల్లికి ఏమీ తెలియకపోవడం... మీకు తగిన వరుడిని చూసి పెళ్లి చేయాలనే ఆలోచన, బాధ్యత మీ తల్లిదండ్రులకు లేకపోవడం విచారకరం. మీరు స్నేహితురాళ్ల జీవితాలతో పోల్చుకుని బాధపడుతున్నారు. ఇది పూర్తిగా ప్రతికూల ఆలోచన. మీ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోకపోతే... మీ బంధువుల్ని సాయం అడగండి. మీ సమస్యను పంచుకుని వారి సలహా తీసుకోండి. లేదా అమ్మతో విషయం చెప్పి ఆమెతోనే బంధువులకు చెప్పించండి. ఇందులో మొహమాట పడాల్సిందేమీ లేదు. అయితే అందుకోసం వారికి కొంత సమయం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో తొందర పనికిరాదు. హడావిడిగా తీసుకునే నిర్ణయాలు మంచివి కాదు. మీరు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి.
ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలుంటాయి. ఏ ఇద్దరి జీవితాలు ఒకేలా ఉండవు. ఎవరి జీవితంలో వచ్చిన సమస్యలను వారే అధిగమించాలి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చక్కగా పీజీ వరకు చదువుకున్నారు. తెలివి తేటలతో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇవన్నీ మీలోని సానుకూల అంశాలు. వీటినే గుర్తు తెచ్చుకోండి. అప్పుడే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటారు. ఇప్పుడే ఉద్యోగంలో చేరారు. కాబట్టి పెళ్లి కూడా త్వరలోనే అవుతుందని నమ్మండి. ఒకవేళ అవకపోయినా కూడా బాధపడాల్సిన పని లేదు. పెళ్లే జీవితం కాదు.పెళ్లి కాకుండా ఉన్న చాలామంది ఎన్నో విజయాలు సాధించారు. మీ మీద నమ్మకం ఉండాలి. సమాజం ఏమనుకుంటుందోననేది ముఖ్యం కాదు.
ఇదీ చదవండిః ఉదయం పూట నడిస్తే... రాత్రి నిద్ర పడుతుందట..