ETV Bharat / lifestyle

మనస్పర్థలు రాకుండా ఉండేందుకు ఇలా చేయండి.. - wife and husband relationships

భార్యాభర్తలిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, భావోద్వేగాలు ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకుని ప్రవర్తిస్తే ఎలాంటి గొడవలకూ అవకాశం ఉండదు. ఒక్కోసారి ఇద్దరిలో ఒకరికి చిరాగ్గా ఉండొచ్చు. ఈ విషయాన్ని రెండోవాళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే.. వెంటనే మనస్పర్థలు తలెత్తుతాయి. ఎదుటివారిని కాస్త గమనించి మాట్లాడితే ఇలాంటివాటిని ముందుగానే నివారించవచ్చు.

wife and husband healthy relationship techniques
మనస్పర్థలు తలెత్తొద్దంటే...?
author img

By

Published : Mar 22, 2021, 12:57 PM IST

కాస్త గమనిస్తూ మాట్లాడాలి...
కాస్త గమనిస్తూ మాట్లాడాలి

* ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు మీరు మామూలుగానే మాట్లాడినా ఆ మాటలు వాళ్లను బాధించవచ్చు. మీరు సరదాకు ఏమైనా అన్నా వాళ్లు సీరియస్‌గా తీసుకుని గొడవ పెట్టుకునే అవకాశం లేకపోలేదు. అందుకే మాట్లాడుతున్నప్పుడు ఓ కంట భాగస్వామిని కనిపెడుతూ ఉండాలి.

* చిరాగ్గా ఉన్నప్పుడు దాన్ని మనసులోనే పెట్టుకుని బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. దీంతో బాధ మరింత పెరుగుతుందేగానీ తగ్గదు. దాన్ని భాగస్వామితో పంచుకుంటే బాధ సగమవుతుంది.. సంతోషం రెట్టింపవుతుంది. మనసులోని బాధలను పంచుకోవడానికి మనకో మనిషి ఉన్నారనే భావనే ఎంతో సంతృప్తినీ ఇస్తుంది.

* దంపతుల మధ్య ఎన్ని చిరాకులూ, కోపతాపాలున్నా వాటితో అలాగే నిద్రపోవడానికి ప్రయత్నించకూడదు. ఏరోజు సమస్యలను ఆ రోజే పరిష్కరించుకుంటేనే మనసుకు హాయిగా ఉంటుంది. లేకపోతే అవే సమస్యల గురించి పదేపదే ఆలోచిస్తూ పడుకుంటే సరిగా నిద్రపట్టదు. మర్నాడు లేచిన తర్వాత కూడా మళ్లీ అవే గుర్తుకువచ్చి బాధిస్తాయి.

ఇదీ చదవండి: వెంటాడుతున్న కరోనా భయాలు- నష్టాల్లో మార్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.