ETV Bharat / lifestyle

భాగస్వామితో గొడవైందా...  కూల్ చేసేయండిలా!

రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గొడవలు రావడం సహజం. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలే కానీ.. అలాగే వదిలేయడం వల్ల అది తమ రిలేషన్‌షిప్‌లో మరిన్ని సమస్యలకు కారణమయ్యే ప్రమాదముంది. ఈక్రమంలో భాగస్వామితో జరిగిన గొడవను పరిష్కరించే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మీకోసం..!

relationship
relationship
author img

By

Published : Jun 23, 2020, 7:51 PM IST

రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు.. అసలు గొడవ కంటే ఇద్దరిలో ముందు ఎవరు మాట్లాడతారనే విషయమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీ భాగస్వామితో మీరే ముందు మాట్లాడటానికి ప్రయత్నించండి. దీనికి కాస్త ధైర్యం కావాలి. ఒకవేళ మీకు వారితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఇబ్బంది అనిపిస్తే... ఒక ఫోన్‌కాల్ చేసి మాట్లాడండి. అవతలి వ్యక్తిని నొప్పించకుండా మీ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ఇలా మాట్లాడగలిగితే మీ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.

మెసేజ్ మంచిదే..!

మీ పార్ట్‌నర్‌తో మీకు గొడవ జరిగిన తర్వాత ఒకరిపై ఒకరు కోపంగానే ఉంటారు. అది సహజం. ఆ కోపంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి ఆసక్తి చూపించుకోకపోవచ్చు. కానీ.. ఈ గ్యాప్ ఎక్కువ సమయం కొనసాగడం మీ రిలేషన్‌షిప్‌కు అంత మంచిది కాదు. అందుకే.. తప్పు ఎవరిదనే విషయం పక్కనబెట్టి మీ మనసులో భావాలను మీ భాగస్వామికి ఒక సందేశం రూపంలో మెసేజ్ చేయండి. మీకు మీ పార్ట్‌నర్ అంటే ఎంత ఇష్టమో, మీ రిలేషన్‌షిప్‌ను ఏ స్థాయిలో మీరు గౌరవిస్తున్నారనే విషయాలను ఆ సందేశంలో వివరించండి. గతంలో మీరు ఆనందంగా గడిపిన కొన్ని సందర్భాలను తనకు గుర్తు చేయండి.

సర్‌ప్రైజ్ ఇవ్వండి..!

రిలేషన్‌షిప్‌లో గొడవ జరిగిన తర్వాత.. మీ భాగస్వామికి ఏదైనా సర్‌ప్రైజ్ ఇవ్వడమనేది మీ మధ్య దూరం పెరగకుండా ఉండడానికి తారకమంత్రంలా పని చేస్తుంది. ఈక్రమంలో ఆ సర్‌ప్రైజ్ ఖరీదైనదే కానక్కర్లేదు. మీ పార్ట్‌నర్ మనసును ఆనందింపజేసే ఓ చిన్న వస్తువు.. ఏ చిన్న పనైనా సరే దాని ప్రభావం బలంగా ఉంటుంది. ఉదాహరణకు ఓ అందమైన గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం, తనకు ఇష్టమైన వంటను చేసి పెట్టడం.. మొదలైనవి అన్నమాట.

చెప్పేయండి సారీ.. వందో సారి..!

తప్పు చేయడానికన్నా.. చేసిన తప్పును ఒప్పుకునేందుకు ఎక్కువ ధైర్యం కావాలంటారు. మీ రిలేషన్‌షిప్ సాఫీగా సాగాలంటే.. మీ మధ్య జరిగిన గొడవలో తప్పు మీదేనని మీకు అనిపించినప్పుడు మీ పార్ట్‌నర్‌ను క్షమాపణ అడగడానికి సంశయించకండి. జీవితాంతం మీతో కలిసుండాల్సిన వ్యక్తి దగ్గర ఒక్క మెట్టు దిగడం చిన్నతనంగా భావించక్కర్లేదు. ఇలా చేయడం వల్ల మీ మధ్య ఉండే గొడవ పరిష్కారమవడమే కాకుండా.. మీ భాగస్వామికి మీపై ఉన్న గౌరవం రెట్టింపవుతుంది.

ఇదీ చూడండి: అమెజాన్​లోనూ ఇక మద్యం హోం డెలివరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.