ETV Bharat / lifestyle

Relationship tips: ఆలుమగల అనుబంధం సంతోషంగా సాగాలంటే.. ఇలా చేయండి! - తెలంగాణ వార్తలు

పెళ్లంటే నూరేళ్ల పంట. విభిన్న అభిరుచులు కలిగిన కుటుంబాల నుంచి వచ్చి... ఇరువురూ కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే ఈ దాంపత్య జీవితంలో అనుబంధాలతో పాటు అనేక ఒడుదొడుకులు ఉంటాయి. అప్పుడే బేధాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో మీ బంధం పదిలంగా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.!

Relationship tips, tips for wife and husband relation
చక్కని దాంపత్యానికి చిట్కాలు, భార్యాభర్తల అనుబంధం కోసం చిట్కాలు
author img

By

Published : Jul 19, 2021, 10:30 AM IST

Updated : Jul 19, 2021, 11:36 AM IST

ఆలుమగల అనుబంధం సంతోషంగా సాగిపోవాలంటే... భవిష్యత్తుపై స్పష్టతతో పాటు సర్దుబాట్లు ఉండాలి. కీలక సమయాల్లో ఒక్కటై నడిచే ఓర్పు, నేర్పు కావాలి. అందుకోసమే ఈ చిట్కాలు.

గౌరవించండి:

భార్యాభర్తల కుటుంబ నేపథ్యం, చదువు, అలవాట్లు వంటివన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఏడడుగులు నడిచిన తర్వాత కూడా ఇరువురి పద్ధతులు, జీవనశైలి వేరేగా ఉండొచ్చు. అయితే ఇద్దరూ జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని అనుకోవడం మాత్రం తప్పనిసరి. అది వారి ఉద్యోగానికి సంబంధించినదైనా కావొచ్చు. లేదా కుటుంబానికి చెందినదైనా అవ్వొచ్చు. ఉన్నత విద్యాభ్యాసంపై ఆసక్తి, ఆర్థికంగా నిలబడాలనే ఆశ వంటివి ఒకరికొకరు పంచుకోవాలి. పరస్పరం ఆశయాల సాధనలో ప్రోత్సహాన్ని అందించుకోలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.

లక్ష్యం ఉండాలి:

భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. కానీ ఇద్దరూ కలిసి తమ కోసం, కుటుంబం కోసం కూడా గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే బాధ్యతలు అర్థమవుతాయి. అపార్థాలు దరిచేరవు. ఒకవేళ ఇద్దరూ కలిసి అనుకున్న ప్రణాళికలో పొరబాటు జరిగినా... ఇబ్బందులు ఎదురైనా, ఒకరినొకరు నిందించుకోవద్దు. కూర్చుని మాట్లాడుకుని సర్దుబాట్లు చేసుకోండి. అప్పుడే మీరనుకున్నది చేయగలరు.

పంచుకోండి:

భార్యాభర్తలిద్దరూ సమానమే అనే భావన ఉండాలి. తమ లక్ష్యమే గొప్పదనో, లేదా తాము మాత్రమే కుటుంబం కోసం పాటు పడుతున్నామనో ఆలోచించకూడదు. కలిసి కష్టపడుతున్నది కుటుంబ క్షేమం కోసమే అనుకోవాలి. మీ మార్గాల్లో ఇబ్బందులను భాగస్వామితో పంచుకోవాలి. వాటిని సాధించగలవనే నమ్మకాన్ని ఎదుటివారికి కలిగించాలి. అప్పుడే అభద్రత దూరమై ఆ అనుబంధంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

కేవలం ఇవే కాదు.. రోజూ ఇద్దరూ ఒకరికి నచ్చినట్లుగా మరొకరు ఉండడం, ఒకరికి నచ్చిన పనులు మరొకరు చేయడం, భాగస్వామితో ప్రేమగా ఉండడం, మనసు విప్పి మాట్లాడుకోవడం వంటివన్నీ చేస్తే ఆలుమగల అనుబంధం సంతోషంగా సాగుతుందని అంటున్నారు నిపుణులు!

ఇదీ చదవండి: New Relation : కలహాల కాపురానికి బై.. కొత్త బంధాలకు సై

Last Updated : Jul 19, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.