ETV Bharat / lifestyle

parenting tips: ఆరంభంలోనే అసూయకు చెక్‌ పెట్టాలి.. - telangana varthalu

సుశీల తన ఇద్దరి కూతుళ్లకు చాలా విషయాల్లో సర్దిచెప్పలేక సతమతవుతుంది. ఒకరి దుస్తులు, నగలు, పుస్తకాలను చూసి మరొకరు ఉడుక్కుంటారు. తోబుట్టువులైనా ఒకరిని చూస్తే మరొకరికి అసూయ. కొందరు పిల్లలైతే తమ బొమ్మలపై తోటి చిన్నారులను చేయి కూడా వేయనివ్వరు. పిల్లల్లో ఈ తరహా అసూయ, స్వార్థం వంటి లక్షణాలను గుర్తిస్తే వాటిని చిన్నప్పటి నుంచే మార్చగలగాలి. లేదంటే పెద్దైన తర్వాత వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు మానసిక నిపుణులు.

parenting tips
ఆరంభంలోనే అసూయకు చెక్‌ పెట్టాలి..
author img

By

Published : Jun 23, 2021, 4:25 PM IST

* ఒత్తిడి తేకుండా...

పిల్లలు తమ బొమ్మలు, వస్తువులను ఇతరులు తీసుకుంటే సాధారణంగా ఒప్పుకోరు. అలాగే తోటి పిల్లల ఆట వస్తువులను చూసి అసూయ పడతారు. వాటిని లాక్కోవడానికి చూస్తారు. ఈ లక్షణాల్ని గుర్తించిన వెంటనే మార్చడానికి ప్రయత్నించాలి. తమవి ఇతరులకూ ఇవ్వడం నేర్పాలి. అసూయ తప్పని చెప్పాలి. అయితే ప్రారంభంలో పిల్లలపై ఈ అంశాల్లో ఎక్కువగా ఒత్తిడి తేకుండా సున్నితంగా వివరించాలి. అప్పుడే వింటారు. అరవడం, తీవ్రంగా విమర్శించడం చేస్తే పూర్తిగా పెడచెవిన పెడతారు.

* పంచడం నేర్పాలి...

ఇంటికెవరైనా వస్తే, వారి చిన్నారులకు తమ వద్ద ఉన్న ఆట వస్తువులను కాసేపు ఆడుకోవడానికి ఇవ్వమని చెప్పాలి. మొదట తిరస్కరించినా నెమ్మదిగా అలవాటవుతుంది. ఇది పంచుకునే గుణాన్ని పెంచుతుంది. దీంతో ఇతరుల వస్తువులను చూసి అసూయ పడటం, తమ బొమ్మలు తమ వద్దే ఉండాలనే స్వార్థం క్రమేపీ దూరమవుతాయి. పిల్లలతో పేదవారికి సాయపడటం, తమ పుస్తకాలు, పెన్సిళ్లు, పాతబ్యాగులు వంటివి ఇప్పించాలి. ఈ అలవాట్లు వారిలో తోటివారికి సాయపడే గుణాన్ని పెంచుతాయి. తమ వద్ద ఉన్నదాన్ని లేనివాళ్లకు అందించాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి వారి మనసులో నాటాలంటే తల్లిదండ్రులు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. అప్పుడే పెద్దవారిని పిల్లలు స్ఫూర్తిగా తీసుకుంటారు.

* ఇచ్చిపుచ్చుకోవడం..

తోటిపిల్లలతో ఆడుకుంటున్న చిన్నారులకు ఇచ్చిపుచ్చుకోవడం నేర్పించడం తేలిక అని చెబుతున్నారు నిపుణులు. ఒకరి బొమ్మలు ఎదుటివారికిచ్చి, వారి నుంచి కావాల్సిన వాటిని తీసుకోవడంలో ఇద్దరూ ఎక్కువసేపు సరదాగా ఆడుకోవచ్చు అని పిల్లలకు చెప్పాలి. ఈ పద్ధతిని అలవరుచుకుంటే వారిలో ఇతరులను తమతో కలుపుకొనే మంచి మనస్తత్త్వం ఏర్పడుతుంది. ఇది వారిలో అసూయ, స్వార్థం వంటి లక్షణాలను దూరం చేసి, కలివిడితనాన్ని నేర్పుతుంది.

* ప్రత్యేక రోజుల్లో

తల్లిదండ్రులు ప్రత్యేక రోజుల్లో పిల్లలను అనాథాశ్రమం, వృద్ధాశ్రమం వంటి వాటికి తీసుకెళ్లాలి. పుట్టినరోజులు, పండగలు వచ్చినప్పుడు కొంత సమయం అక్కడ గడిపేలా చూడాలి. వారికి ఆహారం, నిత్యావసర వస్తువులు వంటివి పిల్లలతో ఇప్పించాలి. ఇది వారిలో దానగుణాన్ని అలవరుస్తుంది. తమకన్నా పేదరికంలో ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలో ఉన్నారని చిన్నారులు తెలుసుకోవాలి. ఎన్ని బొమ్మలు, దుస్తులున్నా ఏమీ లేవు అంటూ పేచీ పెట్టే అలవాటును మానుకుంటారు. ఎందుకంటే, అవి కూడా లేనివారు ఎందరో ఉన్నారని వారికి అర్థమవుతుంది.

ఇదీ చదవండి: Kachili Fish: ఈ చేప ధర రూ.2.60లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.