ETV Bharat / lifestyle

మనస్పర్థలు రాకూడదంటే మిమ్మల్ని మీరు ఇలా పరీక్షించుకోండి! - ఈటీవీభారత్​ రిలేషన్​షిప్ వార్తలు

భార్యాభర్తల మధ్య తలెత్తే అనేక మనస్పర్థలకు ముఖ్య కారణం.. అసూయ. ఇది ఎక్కువగా ప్రదర్శించే భాగస్వామి వల్ల ఎదుటివాళ్లు మానసిక వేదనకు గురవుతారు. అలాకాకుండా ఉండాలంటే ఒకసారి మిమ్మల్ని మీరు ఇలా పరీక్షించుకోవచ్చు.

deal with your partner without ego is the best thing
మనస్పర్థలు రాకూడదంటే ఇలా పరీక్షించుకోండి!
author img

By

Published : Oct 8, 2020, 8:25 AM IST

అసూయ వెనకున్న అసలు కారణాలను అన్వేషించడానికి ప్రయత్నించాలి. మీలోని అభద్రతా భావమే చాలావరకు ఇందుకు కారణమవుతుంది గతంలో జరిగిన దుర్ఘటనలు, బాల్యంలో అనుభవించిన బాధలు అభద్రతకు కారణమైతే, వాటిని గుర్తించి బయటకు రావాలి.

  • ఎదుటి వారిలో మిమ్మల్ని మీరు పోల్చుకో వడం వల్ల అసంతృప్తే మిగులుతుంది. అది కాస్తా వారిమీద అసూయగా మారుతుంది. ఈ పోలికను ఆపేయండి.
  • ఆభద్రతాభావంతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే అసూయ దరిదాపులకు రాదు.
  • అసూయతో రగిలిపోతున్న విషయాన్ని ఎదుటివాళ్లు గమనించే ఉంటారు. మీరు పడుతున్న ఇబ్బందిని గురించి నిజాయతీగా వాళ్లతోనే మాట్లాడవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడటానికి వారి సాయం తీసుకోవచ్చు.

ఇదీ చదవండిః బయటికి చెప్పరు.. కానీ దీని గురించే గొడవ పడతారట !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.