సేతు బంధాసనం
నేల మీద వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ పైకి మడిచిపెట్టాలి. రెండు పాదాల మధ్య ఎడం ఉండాలి. రెండు చేతులను వెనక్కు చాపాలి. శ్వాస తీసుకుంటూ నడుమును పైకి లేపాలి. చేతులను అలాగే ఉంచి శ్వాస వదులుతూ నడుమును కిందకు దించాలి. ఇలా పదిసార్లు నిదానంగా, ప్రశాంతంగా చేయాలి.
లోబీపీకి చెక్..!
వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. చూపుడు వేలును తిన్నగా చాపాలి. బొటనవేలికి మధ్యవేలు కలపాలి. మధ్యవేలు కింద ఉంగరం వేలు, దాని కింద చిటికెన వేలు ఇలా.. ఒకవేలి కింద మరో వేలు ఉండేలా చూడాలి. ఈ ముద్రలో ఐదు నిమిషాల పాటు ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి.