ETV Bharat / lifestyle

ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే.. పండ్ల పూతలు

రోజు పండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని మనందరికీ తెలుసు. అవి ఆరోగ్యంతో పాటు అందాన్నీ రెట్టింపు చేస్తాయి. తక్కువ సమయంలో మెరిసిపోయేలా చేసే ఈ ప్రూట్‌ఫేస్‌ ప్యాక్‌లు మీకోసమే.

author img

By

Published : Sep 11, 2020, 10:43 AM IST

fruit face packs will help for glowing skin
అందానికి పండ్ల పూతలు

మచ్చలు మాయం... ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు పోవాలంటే ఇలా చేయండి. కప్పు బొప్పాయి గుజ్జులో చెంచా తేనె రెండు చెంచాల కలబంద గుజ్జు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. పావుగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే క్రమంగా మచ్చలు పోతాయి. అలానే చర్మానికి తగిన తేమ అంది నిగారింపుగా కనిపిస్తుంది.

ముడతలు రావు... అవకాడో, కివీ విదేశీ పండ్లు అయినా...ఇప్పుడు మనదగ్గరా విరివిగానే దొరుకుతున్నాయి. వీటిని మెత్తగా చేసుకుని ఆ మిశ్రమానికి కొంచెం తేనె, కాస్త పెరుగూ కలపాలి. దీన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. ఇరవైనిమిషాలు అరనిచ్చి తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లైనా చేస్తే ముడతలూ, చారలు వంటివి తొందరగా రావు. చర్మం కాంతివంతంగానూ కనిపిస్తుంది.

ఇదీ చూడండి : పెదాల పగుళ్లు, ముఖంపై మొటిమలు ఎందుకొస్తాయో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.