ETV Bharat / lifestyle

Female photographer: పసిపిల్లల కేరింతలను అందమైన జ్ఞాపకంగా! - తెలంగాణ వార్తలు

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆమె చేతుల్లోకి తీసుకుంటే చాలు...  కెమెరా లెన్స్‌కు ఫోజులిచ్చేస్తారు. తను ఆ బోసినవ్వులను ఫ్రేమ్​లో బంధించడానికి గంటల తరబడి ఎదురుచూసి మరీ తాననుకున్నది సాధిస్తుంది. పసిపిల్లల కేరింతలను ఫ్రేమ్​లో బిగించి అందమైన జ్ఞాపకంగా అందిస్తుంది. ఆ సృజనాత్మకతకే ఇటీవల మెల్‌బోర్న్‌కు చెందిన ఓ సంస్థ నుంచి అవార్డుని అందుకుంది. ఆమే హైదరాబాద్‌కు చెందిన ముప్పైఏళ్ల మధు వెనిగెళ్ల.

Female photographer, hyderabad photographer
ఫిమేల్ ఫొటోగ్రాఫర్, హైదరాబాద్ ఫొటోగ్రాఫర్
author img

By

Published : Jun 14, 2021, 2:34 PM IST

అప్పుడే పుట్టిన పిల్లలను చూస్తే చాలు అందమైన జ్ఞాపకంగా అందిస్తుంది ఆమె. ఆ బోసినవ్వులను కెమెరాలో బంధించడానికి గంటల తరబడి ఎదురు చూస్తుంది. ఎలాగైనా చిన్నారుల కేరింతలను అందమైన జ్ఞాపకంగా ఫ్రేమ్​లో బంధిస్తుంది. ఆమే హైదరాబాద్​కు చెందిన ముప్పైఏళ్ల మధు వెనిగెళ్ల. తనదైన సృజనాత్మకతతో మెల్‌బోర్న్‌కు చెందిన ఓ సంస్థ నుంచి అవార్డుని అందుకుంది. గుంటూరులో ఎమ్‌ఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ పూర్తిచేసింది మధు. తండ్రి వెంకటేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌, తల్లి రామతులసి గృహిణి. చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్న మధుకి నాన్నే గురువు. దాంతోపాటు ఫోన్‌ దొరికితే చాలు, ఫొటోలు తీయడం అలవాటు. నాలుగున్నరేళ్లక్రితం ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ చందన్‌కుమార్‌తో పెళ్లికావడంతో హైదరాబాద్‌కు వచ్చిందీమె.

చిన్న బొమ్మతో

‘పెళ్లైన ఏడాదికే బాబు పుట్టడంతో వాడి ఫొటోలు తీయడమే నా సాధనలో భాగమైంది. మొదటి మూడు నాలుగు నెలలు కెమెరాలో భాగాల గురించి తెలుసుకోవడానికే సరిపోయింది. ఆ తర్వాత మా బాబును ఫొటోలు తీసేదాన్ని. నాకు కిడ్స్‌ ఫొటోగ్రఫీ చాలా ఇష్టం. చిన్నపిల్లలను కెమెరా ఫ్రేమ్​లో బిగించడమంటే చాలా కష్టం. నేనూ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ అవ్వాలనుకున్నా. మా వారికి చెప్పి తన దగ్గరే శిక్షణ తీసుకుంటానన్నా. తను ఓ బొమ్మను కొనిచ్చి ఆరునెలల పాటు సాధన చేయించారు. ఆ తర్వాత ఓ స్నేహితురాలికి డెలివరీ అయితే ఆ పుట్టిన బాబును ఫొటోలు తీసి కానుకగా ఇచ్చా. అవి చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. అలా నా కెరియర్‌ మొదలైంది.

కిడ్స్ ఫొటోగ్రఫీపై ఆసక్తి

ఇప్పటివరకు వందమందికిపైగా పిల్లల ఫొటోలు తీశా. నవజాత శిశువు నుంచి పదేళ్లలోపు చిన్నారుల వరకూ ఫొటోషూట్లు చేశా. కొన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లి మరీ తీస్తుంటా. ఒక్కొక్కరికి 40 నుంచి 50 ఫొటోలు తీయాల్సి ఉంటుంది. ఒక షూట్‌కు ఒక్కోసారి రోజంతా పడుతుంది. నేను అనుకున్నట్లుగా ఫొటో రావడానికి మూడుగంటలకు పైగా ఎదురుచూసిన సందర్భాలూ ఉన్నాయి. కొందరు పిల్లలు అప్పటి వరకు నవ్వుతూనే ఉంటారు. ఫొటో తీసే క్షణానికి ఏడవడం మొదలుపెడతారు. వాళ్లని బుజ్జగించి, నవ్వించగలగాలి. ఈ ప్రొఫెషన్‌కు చాలా సహనం కావాలి. నాకొక అసిస్టెంట్‌ ఉన్నాడు! వాడే మా మూడేళ్ల బాబు బవిన్‌. తను నాతోనే ఉంటాడు. ఫొటో తీసే చిన్నారులు ఏడుస్తుంటే వాళ్లను నవ్వించి ఆడిస్తూ ఉంటాడు. పిల్లలకు వేయాల్సిన దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి థీమ్ వరకు సృజనాత్మకతతో ఆలోచిస్తేనే ఫొటో అద్భుతంగా, అనుకున్నట్లుగా వస్తుంది. అలా ఓసారి ఏడాది బాబును చెవుల పిల్లులతో కలిపి తీసిన సందర్భం మాత్రం గుర్తుండిపోయే అనుభవం. కోడిపిల్లలు, పెట్‌డాగ్స్‌, బాతులు వంటి జంతువులతో పిల్లలను తీసే ఫొటోలు చాలా బాగుంటాయి. అవి క్లయింట్లకు నచ్చుతాయి. సూపర్‌ మ్యాన్‌, వండర్‌ విమెన్‌, కెప్టెన్‌ అమెరికా వంటి ప్రత్యేక థీమ్​ ప్రకారమూ వెళుతుంటా. విజయవాడ, గుంటూరు, బెంగళూరు, రాజమండ్రి వంటి దూరప్రాంతాలకూ వెళ్లి ఫొటోలు తీస్తున్నా.

అవార్డు ఫొటో

నాకు అవార్డు వచ్చిన ఫొటో పదిరోజుల వయసున్న పాపది. తనను నా ఒళ్లో ఉంచుకుని నవ్వే వరకు ఎదురుచూశా. తన చిరునవ్వును క్యాచ్‌ చేయడానికి నాలుగు గంటలు పట్టింది. ఆ సమయాన్ని వీడియో కూడా తీశాం. దాన్ని మెల్‌బోర్న్‌ ఫిమేల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ పోటీకి పంపా. ఆ ఫొటోకు ‘ద న్యూ జనరేషన్‌ ఫిమేల్‌ ఫొటోగ్రాఫర్‌’ అవార్డును అందించిన ఆ సంస్థ, ‘ఆ ఫొటో వెయ్యి జ్ఞాపకాలను అందించే అర్హత గలది’ అంటూ ప్రశంసించడమే కాకుండా లక్షన్నర రూపాయల బహుమతినీ అందించింది. ఇది నా కెరియర్‌లో కొత్త ఉత్సాహాన్ని అందించింది’ అని చెబుతోన్న మధు నెలకు 30 షూట్స్‌కు పైగా తీస్తుంది.

ఇదీ చదవండి: Blood donors day: రక్తం పంచుదాం.. ఆయువు పెంచుదాం.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.