ETV Bharat / lifestyle

Dreams : నిద్రలో వింత కలలు వస్తున్నాయా?

నిద్రలో కలలు(Dreams) కనడం సహజం. ఈ కలలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని హాయిగా అనిపిస్తే మరికొన్ని మాత్రం భయపెడుతుంటాయి. ప్రతిఒక్కరిలో వారి మానసిక స్థితి.. నిద్రపోయే ముందు ఆలోచించే విషయాలు.. రోజులో జరిగిన సంఘటనల వల్ల కలలు వస్తుంటాయి. కొందరిలో మాత్రం వారి గతంలో జరిగిన సంఘటనలు.. మెదడుపై అధిక ప్రభావం చూపించిన విషయాలు.. ఎక్కువగా కలలో వస్తుంటాయి. పదేపదే కలలు(Dreams) రావడానికి కారణమేంటి?

reason-behind-getting-variety-dreams
నిద్రలో వింత కలలు కంటున్నారా?
author img

By

Published : Jul 12, 2021, 8:56 AM IST

Updated : Jul 12, 2021, 9:09 AM IST

నిద్రపోయినప్పుడు కలలు(Dreams) రావడం సహజం. లేచిన వెంటనే కొందరికి ఈ కలలు గుర్తుండవు. మరికొందరికి ఆ రోజంతా ఆ కల మెదడులో తిరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన కలలు వస్తుంటాయి. కొందరు రోజుకో రకమైన కలలు కంటుంటారు. మరికొందరికి మాత్రం ప్రతిరోజు దాదాపు ఒకే రకమైన కల వస్తుంటుంది.

పదేపదే అదే కల వస్తే..

కొందరిలో.. ఎత్తైన చెట్టు లేదా కొండ మీద నుంచి జారిపడిపోతున్నట్టుగా కల(Dreams) వస్తుంది. మరికొందరిలో ఒంటి మీద సరైన దుస్తులు లేకుండా భయంతో పరుగులు పెడుతున్నట్టుగా వింత కలలు వస్తాయి. పదేపదే ఇలా రావడానికి కారణమేంటో చెబుతున్నారు.. ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి.

అణుచుకుంటే.. ఇలా బయటపడతాయి..

దినచర్యలో ఎదురయ్యే సంతోషకర లేదా దిగులేసే విషయాలు, ఉద్వేగాలను వ్యక్తం చేయలేక అణచుకోవడం లేదా ఇన్హిబిషన్స్‌ స్వప్నావస్థలో కలల్లా(Dreams) బయటపడతాయి. ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు, నీళ్లలో జారిపడుతున్నట్లు వచ్చే కలలు భయాందోళనలు, అభద్రతాభావాలకు సంకేతం. అంటే చెడు జరుగుతుందేమోనన్న భయమన్నమాట. నగ్నంగా ఉన్నానన్న కల తననెవరో అవమానిస్తున్న, సిగ్గువిడిచి చేయకూడని పనులు చేస్తానేమోనన్న భయాన్ని తెలియజేస్తుంది.

ఆత్మవిశ్వాసం..

మీరు ఆలోచిస్తే మీ దుఃఖానికి, అభద్రతకు కారణమేంటో తెలుస్తుంది. మీరు ఉన్నత స్థితికి వెళ్లి, అక్కడి నుంచి పడిపోతానేమో, అందరూ నవ్వుతారేమోనని, లేదా క్లిష్ట పరిస్థితిలో ఉండి దాన్ని అధిగమించలేకపోవడం చూసి అవమానిస్తారేమో లాంటి భయం, అభద్రతాభావం వల్ల ఇలాంటి కలలు(Dreams) వస్తుండొచ్చు. ముందు మీరు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోండి. లేదంటే సైకాలజిస్టు దగ్గరకు వెళ్తే సైకో అనాలసిన్‌ ద్వారా మీ వ్యక్తిత్వాన్ని అస్సెస్‌ చేశాక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఈ కలలు(Dreams) మళ్లీమళ్లీ వస్తూ నిద్రపట్టకున్నా లేదా ఆందోళనను అధిగమించలేకున్నా సైకియాట్రిస్టును సంప్రదించండి. కౌన్సెలింగ్‌తోబాటు ఇలాంటి కలల(Dreams)ను ఆపడానికి కొన్ని మందులు కూడా ఇస్తారు.

Last Updated : Jul 12, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.