చింత చిగురు :
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. గుండెజబ్బు, క్యాన్సర్, మధుమేహం వంటివి రాకుండా చేస్తుంది. గాయం మాన్పడంలోనూ తోడ్పడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం.. శరీరంలో జరిగే 600కుపైగా క్రియలకు సాయపడుతుంది. దేహంలోకి చేరే బ్యాక్టీరియా, వైరస్, ఫంగైలకు వ్యతిరేకంగానూ చింత చిగురు పనిచేస్తుంది.
చుక్కకూర :
విటమిన్ సి గుణాలెక్కువ. ఆహారం త్వరగా అరగడంలో సాయపడటమే కాకుండా మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాలకూ మంచి ఔషధం.
గోంగూర :
ఫోలెట్, విటమిన్ బీ6తోపాటు ఐరన్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, జింక్, విటమిన్ ఎ దీనిలో సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని గుణాలు శరీరాన్ని చల్లబర్చడంలో సాయపడతాయి. మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం.. ఎముకలను దృఢపరుస్తాయి. జ్వర లక్షణాలను తగ్గించడంలోనూ పాత్ర పోషిస్తుంది.
పాలకూర :
సి, ఎ విటమిన్లు ఎక్కువ. ఇవి రోగనిరోధశక్తికీ, కళ్ల ఆరోగ్యానికీ తోడ్పడతాయి. ఈ ఆకుకూరలో శరీరానికి అత్యవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. దీనిలో ఉండే ల్యూటిన్ రెటీనాని రక్షించి, దృష్టిపరమైన సమస్యలు రాకుండా చేస్తుంది. పొటాషియం గాయాల నుంచి రక్తాన్ని గడ్డకట్టించడంలో తోడ్పడుతుంది.
- ఇదీ చదవండి : గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటే ఆరోగ్యానికి చేటే!