ETV Bharat / lifestyle

CHOCOLATES : చాక్లెట్లు తింటే ముడతలు రావట! - benefits of eating chocolates

చాక్లెట్లు (CHOCOLATES) అంటే ఇష్టపడని వారుండరు. చిన్నా పెద్ద అంతా చాక్లెట్ ప్రియులే. కానీ వీటిని తింటే ఆకలి మందగిస్తుందని, పళ్లు పుచ్చిపోతాయని భయపడుతుంటారు. పిల్లల్ని ఎక్కువగా తిననివ్వరు. పెద్దలు తినడానికి సాహసించరు. మధుమేహం లాంటి వ్యాధులుంటే తప్ప చాక్లెట్లను దూరం పెట్టాల్సిన అవసరం లేదని పరిశోధకులు తేల్చారు. పైగా.. చాక్లెట్ల(CHOCOLATES)లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని సమతులంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు.

chocolates keeps you healthy
చాక్లెట్లు తింటే ముడతలు రావట
author img

By

Published : Jul 6, 2021, 10:00 AM IST

న్నం తినడానికి మారాం చేసే పిల్లలు చాక్లెట్లు(CHOCOLATES) మాత్రం మహా ఇష్టపడతారు. కానీ ఆకలి మందగిస్తుంది, పళ్లు పుచ్చిపోతాయంటూ పెద్దలు భయపెట్టడం తెలిసిందే. మధుమేహం లాంటి సమస్యలుంటే తప్ప.. చాక్లెట్లని దూరం పెట్టాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని తేల్చారు పరిశోధకులు. కనుక ఇకపై చాక్లెట్ల(CHOCOLATES) గురించి జడవాల్సిన పనిలేదు. అతిగా తింటే ఊబకాయం రావచ్చు, పళ్ల సమస్యలు రావచ్చు. మితంగా తింటే మాత్రం మంచిదే. అమెరికన్‌ సర్వేలు అదే చెబుతున్నాయి. తాజాగా ‘నెదర్‌ల్యాండ్స్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ కూడా చాక్లెట్లు తింటే మంచిదేనని వెల్లడించింది. ఇకనేం.. చాక్లెట్లను భేషుగ్గా తిందాం.

ఇదీ చదవండి : ఆ దేశంలో 'ప్రభాస్'​ చాక్లెట్స్​'.. భారీగా సేల్​!

  • చాక్లెట్ల(CHOCOLATES)లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి శరీరాన్ని సమతులంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  • మంచి పోషకాహారం. నీరసాన్ని తగ్గించి వేగంగా శక్తినిస్తాయి.
  • ఎండవేడిమి నుంచి శరీరాన్ని కాపాడతాయి. చర్మానికి కాంతినిస్తాయి.
  • కొలెస్ట్రాల్‌ సాయిని తగ్గిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
  • ఒత్తిడిని తగ్గిస్తాయి. మతిమరుపు రాకుండా చేస్తాయి.
  • చాక్లెట్ల(CHOCOLATES)లో ఉండే కొకొవా శరీరం, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
  • చాక్లెట్లు(CHOCOLATES) తినడంవల్ల త్వరగా ముడతలు రావు.
  • బాధ, దిగులు లాంటి మూడ్స్‌ను పోగొట్టి సంతోషంగా ఉంచుతాయి.
  • ఆడుకునే, పరుగులెత్తే సమయంలో చాక్లెట్‌(CHOCOLATES) తినడంవల్ల ఆక్సిజన్‌ సక్రమంగా అందుతుంది.
  • గర్భిణిలు రోజుకొక ఔన్సు చాక్లెట్‌ (CHOCOLATES)తింటే పిండం చక్కగా పెరుగుతుందని అట్లాంటాలో ‘మెటర్నల్‌ ఫెటల్‌ మెడిసిన్‌’ పరిశోధనలో తేలింది

ఇదీ చదవండి : రాళ్లు, బొగ్గు.. అన్నీ తినుబండారాలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.