కాలంతో పనిలేకుండా కొందరి పెదాలు పొడిబారుతుంటాయి. ఎండాకాలం, శీతాకాలంలో డీహైడ్రేషన్ సమస్య తోడై పగులుతుంటాయి కూడా. దానికి పరిష్కారాలు ఇవీ...
గ్రీన్ టీ... టీ, కాఫీలు తాగడం వల్లా పెదాలు నల్లగా మారతాయి. బదులుగా ఓ కప్పు గ్రీన్ టీ తీసుకోండి. ఇందులోని పాలీఫినాల్స్ ఎండ తీవ్రతకు గురైన పెదాలకు సాంత్వన కలిగిస్తాయి. అలానే వాడేసిన గ్రీన్ టీ బ్యాగులతో అధరాలపై మృదువుగా మర్దనా చేసినా నలుపుదనం తగ్గుతుంది.
పెరుగు... క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది డీహైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది. దాంతో పాటు పెరుగులో రెండు కుంకుమ పువ్వు రేకలు వేసి పెదాలకు రాయండి. కాసేపాగి కడిగేస్తే తేమగా, తాజాగా కనిపిస్తాయి.
నిమ్మ... శరీరంలో మలినాలు పేరుకుపోవడం వల్ల కూడా చర్మం, పెదాలు నల్లగా మారే ప్రమాదం ఉంది. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే ట్యాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. నిమ్మకాయ సహజ బ్లీచ్‌లా పని చేస్తుంది. నిమ్మ చెక్కపై కాస్త పంచదార చల్లి పెదాలపై రుద్దితే మృత కణాలు తొలగిపోవడంతోపాటు నలుపు తగ్గుతుంది.
బీట్‌రూట్... జ్యూస్‌ను తాగండి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఆరోగ్యాన్నీ, అందాన్నీ పెంచుతాయి. బీట్‌రూట్ రసంలో రెండు చుక్కల చొప్పున తేనె, నిమ్మరసం కలిపి రాసుకుంటే పెదాలు తాజాగా, వర్ణరంజితంగా మారతాయి.
ఇదీ చూడండి: అమ్మాయిలూ.. తిండిలోనూ అబ్బాయిలకు తీసిపోవద్దు..