ETV Bharat / lifestyle

FOOD: యాంటీ వైరల్‌ ఆహారం తిందామా.. ఆరోగ్యాన్ని రక్షించుకుందామా..!

ప్రస్తుతం కొవిడ్ మానవులకు ముప్పుగా మారింది. మన రోగ నిరోధక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకునేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోక తప్పదు. వైరస్​ బారినుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా యాంటీ వైరల్‌ గుణాలున్న కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం.

anti viral food
ఆరోగ్యానికి యాంటీ వైరల్ ఆహారం
author img

By

Published : May 30, 2021, 2:22 PM IST

పోషకాలమ్‌:

కొవిడ్‌ కొత్త కొత్త రూపాలతో మనుషుల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌తోపాటు మనం తీసుకునే పోషకాహారమే మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా యాంటీ వైరల్‌ గుణాలున్న కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో చూద్దామా...

వెల్లుల్లి..!

దీన్ని ఆహారంలో తరచూ తీసుకుంటే సాధారణ ఇబ్బందుల నుంచి, చాలా రకాల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీన్ని ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి నూనె రూపంలోనూ వాడతారు. కాబట్టి కూర, చారు, సలాడ్‌... ఇలా అన్నింటిలో వేసుకోవడం అలవాటు చేసుకోండి.

అల్లం..:

వైరల్‌, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే విషపదార్థాలు శరీరంలో పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. ఇన్ని సుగుణాలున్న దీన్ని టీ, కషాయం, చట్నీ, కూరల్లో... ఇలా వివిధ రూపాల్లో తీసుకోండి.

పసుపు...:

దీనిలో ఔషధ గుణాలు బోలెడు. అలాగే శక్తిమంతమైన సమ్మేళనాలు కూడా. పసుపులోని యాంటీవైరల్‌ లక్షణాలు జలుబు, ఫ్లూ లాంటి వాటి నుంచి మిమ్మల్ని త్వరగా బయట పడేస్తాయి.

లెమన్‌ బామ్‌..:. ఇది హెర్పిస్‌ సింప్లెక్‌ లాంటి వైరస్‌ కారక ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ముందుంటుంది. అలాగే జలుబునూ నియంత్రిస్తుంది. ఇది సూపర్‌ మార్కెట్‌లోనూ లభ్యమవుతుంది.

ఇదీ చూడండి: Water Bills: నల్లాదారులపై బిల్లుల భారం.. సర్వీసు ఛార్జీలతో బాదుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.