మీ వాట్సాప్ సమాచారం వేరేవాళ్లు తస్కరిస్తున్నారా! మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా! మీ సందేశాలు చోరీకి గురయ్యాయని అనుమానమా! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెచ్చింది వాట్సాప్. వ్యక్తిగత గోప్యత, సమాచారం భద్రతలపై కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వేరే వాళ్లు మీ చరవాణీలోని వాట్సాప్ సందేశాలు, సమాచారం లాంటివి తస్కరించకుండా ముఖ్యచిత్ర గుర్తింపు, టచ్ఐడీలని ముందుకుతెచ్చింది వాట్సాప్ సంస్థ. ఐ ఫోన్ 5 ఎస్ నుంచి అన్నీ ఐఒఎస్ మోడల్స్‌లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంటుంది.
వాట్సాప్ ఫీచర్ ఉన్న ఐ ఫోన్లలో ఈ అనువర్తనానికి సంబంధించిన సెట్టింగ్‌లను మార్చుకుంటే సరిపోతుందని సంస్థ వెల్లడించింది. ఈ విధానంతో సమాచార భద్రతే కాకుండా, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లదని స్పష్టం చేసింది.