ETV Bharat / lifestyle

చలికాలంలో చుండ్రుని నివారించండిలా.. !

శీతాకాలం వచ్చిందంటే చాలు.. సౌందర్య సంరక్షణ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాయిశ్చరైజర్ రాసుకొన్నప్పటికీ చర్మం పొడిబారిపోవడం, పెదవులు పగలడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా చర్మం విషయంలో మాత్రమే కాదు.. జుట్టు విషయంలో కూడా ఈ కాలంలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యంగా శీతాకాలంలో కురుల సంరక్షణ విషయంలో ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. ఈ సమయంలో చర్మం మాదిరిగానే కుదుళ్ల భాగం కూడా పొడిగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు తలలో దురద, ముఖంపై చిన్న చిన్న మొటిమలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో వేధించే చుండ్రు సమస్యను ఇట్టే వదిలించుకోవచ్చు. మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకుందామా..

dandruff
చలికాలంలో చుండ్రుని నివారించండిలా.. !
author img

By

Published : Nov 11, 2020, 1:25 PM IST

శీతాకాలంలో సౌందర్య సంరక్షణ విషయంలో నూనెలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. అందుకే కొందరు రాత్రివేళల్లో మాయిశ్చరైజర్‌కి బదులుగా నూనెలను ఉపయోగిస్తుంటారు. నూనెల్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కుదుళ్లను పొడిబారకుండా చేస్తాయి. ఫలితంగా చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనికోసం కొబ్బరి, బాదం, ఆలివ్, జొజోబా.. వంటి నూనెల్లో ఏదో ఒకదానితో లేదా వాటి మిశ్రమాన్ని తీసుకొని గోరువెచ్చగా వేడిచేయాలి. దాంతో మాడును బాగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంట సేపు అలా వదిలేయాలి. దీనివల్ల కుదుళ్లు నూనెను పీల్చుకొంటాయి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి రెండు నుంచి మూడుసార్లు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అయితే శీతాకాలంలో మనం ఉపయోగించే కొన్ని షాంపూలు కూడా చుండ్రు రావడానికి కారణమవుతుంటాయి. కాబట్టి చుండ్రు సమస్య ఉన్నట్లయితే షాంపూల వాడకం విషయంలో సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

కలబందతో..

శీతాకాలంలో కుదుళ్లు పొడిబారడం వల్ల చుండ్రుతో పాటు కొంతమందికి తలలో దురద ఎక్కువగా వస్తుంటుంది. దీనికి కలబంద మంచి పరిష్కారాన్నిస్తుంది. దీనికోసం కలబంద గుజ్జులో వేపాకుల పొడిని కలపాలి. దీనికి కొన్ని చుక్కల ఉసిరి నూనెను కూడా జతచేసి మిశ్రమంగా చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మాడుకు అప్త్లె చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

యాపిల్ సిడర్ వెనిగర్‌తో..

యాపిల్ సిడర్ వెనిగర్‌లో సైతం చలికాలంలో వేధించే చుండ్రు సమస్యను తగ్గించే గుణాలున్నాయి. ఇది కుదుళ్ల పీహెచ్ స్థాయులను అదుపులో ఉంచి తలలో ఫంగస్ పెరగనివ్వకుండా చేస్తుంది. ఈ ఫలితం పొందడానికి అరకప్పు నీటిలో పావు కప్పు యాపిల్ సిడర్ వెనిగర్‌ను కలపాలి. దీన్ని స్ప్రేబాటిల్లో వేసి మాడుపై స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత తలకు టవల్ చుట్టి.. పావుగంట నుంచి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

నిమ్మతో..

నిమ్మలోని సుగుణాలు తలలోని పీహెచ్‌ను సాధారణ స్థాయిలో ఉండేలా చేసి శీతాకాలంలో వచ్చే చుండ్రును తగ్గిస్తాయి. దీనికోసం రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు సున్నితంగా మర్దన చేసుకొని నీటితో కడిగేయాలి. లేదంటే తలస్నానం చేసిన తర్వాత ఒక కప్పు నీటిలో టీస్పూను నిమ్మరసాన్ని కలిపి దాంతో తలను కడిగినా ఇదే ఫలితం కనిపిస్తుంది.

దాల్చిన చెక్కతో..

టేబుల్‌స్పూన్ దాల్చినచెక్క పొడికి రెండు టీస్పూన్ల చొప్పున తేనె, ఆలివ్ నూనెను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ పూర్తిగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని కుదుళ్లకు అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికోసారి చేయడం ద్వారా చుండ్రు రాకుండా జాగ్రత్తపడచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

dandruffghgh650-4.jpg
  • శీతాకాలంలో రోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల కుదుళ్ల నుంచి ఉత్పత్తయ్యే నూనెలు మొత్తం తొలగిపోయి చుండ్రు సమస్య తలెత్తుతుంది.
  • విటమిన్ 'బి', జింక్.. వంటివి అధికంగా లభించే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కుదుళ్లు పొడిబారకుండా చేసి చుండ్రు రాకుండా అడ్డుకుంటాయి. దీనికోసం వాల్‌నట్స్, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు.. వంటివి తీసుకోవడం ఉత్తమం.
  • వీలైనంత వరకు హెయిర్ స్త్టెలింగ్ ఉత్పత్తులను చలికాలంలో ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా కుదుళ్లు సులభంగా పొడిబారిపోతాయి. కాబట్టి ఈ సీజన్లో ఇలాంటి వాటిని ఉపయోగిస్తే.. వాటిలోని రసాయనాల ప్రభావం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
  • చుండ్రు రావడానికి ఉన్న ప్రధానమైన కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. కాబట్టి.. వీలైనంత వరకు దాని ప్రభావం మీపై పడకుండా చూసుకోవాలి. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత విశ్రాంతి ఉండేలా జాగ్రత్తపడితే ఈ సమస్య నుంచి మరింత సులభంగా బయటపడచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.