ETV Bharat / lifestyle

వర్షాకాలంలో ఈ ఫేస్ ప్యాక్స్ ఎందుకు వాడాలో తెలుసా?

అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం కొద్దిగా చల్లగా మారుతోంది. అయితే వర్షం ప్రభావం చర్మసౌందర్యం పైన కూడా పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. అంతేకాదు.. అప్పుడప్పుడూ ఎండ కూడా విజృంభిస్తుంది. ఇలాంటి భిన్నమైన వాతావరణంలో వర్షంలో తడిస్తే చర్మం పాడయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా..

author img

By

Published : Jul 10, 2020, 3:04 PM IST

homemade face packs for monsoon in telugu
వర్షాకాలంలో ఈ ఫేస్ ప్యాక్స్ ఎందుకు వాడాలో తెలుసా?

రోజ్‌వాటర్‌తో..

పావుకప్పు రోజ్‌వాటర్‌ని తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ చందనం పొడి, పావు చెంచా పసుపుని జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్, పొక్కుల వంటివి తొలగిపోయి ముఖ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. పసుపు, చందనంలో ఉన్న ఔషధ గుణాలు చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా చేస్తాయి.

rosepacksvideo650.jpg
రోజ్‌వాటర్‌

గ్రీన్‌టీతో..

రెండు టేబుల్‌స్పూన్ల గ్రీన్ టీపొడి తీసుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్కల బాదం నూనె జత చేసి బ్లెండర్‌తో బాగా మెత్తగా అయ్యే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమంలో బాదం నూనెకు బదులు మీ చర్మతత్వానికి సరిపడే ఇతర అత్యవసర నూనెల్ని సైతం ఉపయోగించవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోవడం వల్ల దురద, ఇతర చర్మ సంబంధిత సమస్యలు దరి చేరవు.

varshambeautygh650-1.jpg
గ్రీన్‌టీ

పుదీనాతో..

గుప్పెడు పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా చేసుకోవాలి. అరటిపండులో సగభాగాన్ని తీసుకొని దాన్ని కూడా మెత్తగా చేసుకోవాలి. ఈ రెండిటినీ బ్లెండర్‌తో బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్ బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటి చర్మానికి పోషణనిచ్చి తేమను కోల్పోకుండా చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించే గుణాలు పుదీనాలో ఉన్నాయి.

varshambeautygh650-4.jpg
పుదీనా

ముల్లంగితో..

ముల్లంగిలో సగభాగం తీసుకొని దాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం జత చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నిమ్మలో ఉన్న విటమిన్ 'సి' చర్మానికి పోషణనివ్వడంతో పాటు అలర్జీలు రాకుండా చూస్తుంది. ముల్లంగిలో ఉన్న సుగుణాలు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి.

varshambeautygh650-2.jpg
ముల్లంగి

కోడిగుడ్డు తెల్లసొనతో..

గుడ్డులోని తెల్లసొనకు చెంచా తేనె జతచేసి బ్లెండర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం క్లెన్సర్‌గా పనిచేసి ముఖాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే మేను జిడ్డుగా మారకుండా కాపాడుతుంది.

varshambeautygh650.jpg
కోడిగుడ్డు తెల్లసొన

గంజితో..

వర్షాకాలంలో వాతావరణ ప్రభావం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు. ఇవి రాకుండా చాలామంది రకరకాల యాంటీబయోటిక్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనకు అందుబాటులో ఉండే గంజి కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను దరి చేరనివ్వదట. ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు, ఔషధగుణాలు అలాంటివి మరి. ఇది కేవలం చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రానీయకుండా చేయడమే కాదు.. మూసుకుపోయిన చర్మరంధ్రాలను సైతం తెరచుకునేలా చేస్తుంది.

ఇవీ.. వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఫేస్‌ప్యాక్‌లు. మరి మీరు కూడా వీటిని ప్రయత్నించి చర్మాన్ని సంరక్షించుకుంటారు కదూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.