మందార : ఈ పువ్వులోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రెండు చెంచాల మందార రేకల గుజ్జుకి, చెంచా కలబంద గుజ్జు, అరచెంచా ముల్తానీ మట్టి, కాస్త రోజ్‌వాటర్ కలిపి ముఖం, మెడ, చేతులకు ప్యాక్ వేసుకోవాలి. పావుగంటయ్యాక శుభ్రం చేసుకుంటే మోము మెరిసిపోతుంది.
కలువ : కలువ పూలు చర్మానికి అవసరమయ్యే కొలాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. రెండు చెంచాల కలువ పూల రేకల ముద్దకు చెంచా చొప్పున తేనె, పాలు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే సరి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే... ముడతలు, మచ్చలూ తగ్గుతాయి.
గులాబీ : చర్మంపై పేరుకున్న మురికిని గులాబీ దూరం చేస్తుంది. కాస్త గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే చాలు.
మల్లె : ముఖానికి తేమను అందించి మెరిపించే గుణాలు మల్లెలో ఉన్నాయి. గుప్పెడు మల్లెలను పేస్టులా చేసి, అందులో చెంచా కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.
ఇదీ చూడండి: kcr: ఆచార్య జయశంకర్ యాదిలో సీఎం కేసీఆర్