ETV Bharat / lifestyle

అందుకే పెళ్లి డ్రస్సులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంది!

అనుకోని అతిథిలా వచ్చిన కరోనా.. పెళ్లి దుస్తులను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న ఓ మహిళ ప్రణాళికలను తారుమారు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వివాహం చేసుకుంది. రిసెప్షన్‌ కూడా రద్దు కావడంతో తన పెళ్లి దుస్తులను అందరికీ చూపించి మురిసిపోవాలన్న ఆమె ఆకాంక్ష నెరవేరలేదు. అయితే తన కోరికను నేరవేర్చుకోవడం కోసం కొత్తగా ఆలోచించింది. ఇంతకీ ఏం చేసిందంటే..

vaccinated with a wedding dress
పెళ్లి డ్రస్సులో కరోనా వ్యాక్సిన్
author img

By

Published : Apr 23, 2021, 3:31 PM IST

Updated : Apr 23, 2021, 4:21 PM IST

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కీలక మలుపు. అందుకే పది కాలాల పాటు గుర్తుండేలా వైభవంగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. ఇక పెళ్లిలో దుస్తులకుండే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ జీవితంలో జరిగే అత్యంత ప్రధాన వేడుక కాబట్టి వధూవరులిద్దరూ తమ దుస్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందరినీ ఆకట్టుకునేలా అందంగా, ప్రత్యేకంగా ఉండేలా తమ దుస్తులను డిజైన్‌ చేయించుకుంటారు.

అయితే వివాహం తర్వాత పెళ్లి దుస్తులను చాలా తక్కువసార్లు ధరిస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో కానీ వాటిని బీరువా నుంచి బయటకు తీయరు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ మహిళ తన పెళ్లి నాటి దుస్తులు ధరించి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. ఇంతకీ ఎవరా మహిళ? వెడ్డింగ్‌ డ్రస్‌తో ఎందుకు వ్యాక్సిన్ తీసుకుంది? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రిసెప్షన్‌ రద్దు..

అమెరికాలోని బాల్టిమోర్ కు చెందిన సారా స్టడ్లీ అనే అమ్మాయి అందరిలాగే వైభవంగా వివాహం చేసుకోవాలనుకుంది. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులందరి సమక్షంలో తనకు నచ్చిన వాడితో కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంది. వివాహ వేదికగా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలోని విశాలమైన బాల్బోవా పార్కును సిద్ధం చేసుకున్నారు. ఇక సారా పెళ్లి దుస్తులను కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. అయితే కోరుకోని అతిథిలా వచ్చిన కరోనా తన పెళ్లి ప్రణాళికలను తారుమారు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వివాహం చేసుకుంది. రిసెప్షన్‌ కూడా రద్దు కావడంతో తన పెళ్లి దుస్తులను అందరికీ చూపించి మురిసిపోవాలన్న ఆమె ఆకాంక్ష నెరవేరలేదు.

నవ వధువుగా ముస్తాబై..

కరోనాపై పోరులో భాగంగా ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇండియాతో పాటు పలు దేశాల్లో కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో వీలైనంత ఎక్కువమందికి టీకా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సారా కూడా టీకా తీసుకుంది. అయితే అందరిలా కాకుండా పెళ్లి దుస్తులు ధరించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు హాజరైంది. ఈ సందర్భంగా పోల్కా డాట్‌ వెడ్డింగ్‌ గౌన్‌లో నవ వధువుగా ముస్తాబైన సారా.. తన దుస్తులకు తగ్గట్టుగానే వైట్‌ కలర్‌ మ్యాచింగ్‌ మాస్క్‌ను ధరించింది.

‘'కరోనా వల్ల మనం ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. నా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ రద్దు కూడా అందులో ఒకటి. అయితే పరిస్థితులనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. త్వరలోనే ఈ కరోనా మహమ్మారి మన మధ్య నుంచి మాయమైపోతుందన్న నమ్మకం నాకుంది. పైగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. భవిష్యత్‌పై అందరికీ భరోసా కల్పించేందుకే వెడ్డింగ్‌ డ్రస్‌లో వ్యాక్సినేషన్‌ సెంటర్‌కి వెళ్లాను. ఇది నా పెళ్లి కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న డ్రస్‌. వివాహం తర్వాత చాన్నాళ్లుగా కప్‌ బోర్డులోనే ఉండిపోయింది. పైగా ఇంతటి అందమైన డ్రస్‌ను అలా కప్‌ బోర్డులో ఉంచడం నాకేమాత్రం నచ్చలేదు'’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది సారా.

  • Here comes the bride...to get her vaccination at M&T Bank Stadium Mass Vaccination Site! Rather than let the beautiful gown for her pandemic-cancelled wedding reception just hang in her closet, Sarah Studley wore it to get vaccinated. pic.twitter.com/eeRJvITO51

    — University of Maryland Medical System (@umms) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదిగో నవ వధువు:

వెడ్డింగ్‌ డ్రస్‌లో వ్యాక్సిన్‌ తీసుకుంటున్న సారా ఫొటోలను యూనివర్సిటీ ఆఫ్‌ మేరీ ల్యాండ్‌ మెడికల్‌ సిస్టమ్‌ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. '‘ఇదిగో నవ వధువు. ఎం అండ్‌ టీ బ్యాంక్‌ స్టేడియంలో తన వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఆమె వెడ్డింగ్‌ రిసెప్షన్‌ రద్దైంది. దీంతో తన పెళ్లి దుస్తులను అలాగే కప్‌ బోర్డులో ఉంచకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం వినియోగించుకుంది'’ అని రాసుకొచ్చింది.

భవిష్యత్‌పై భరోసా..

సారా వెడ్డింగ్‌ గౌన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆమె చేసిన పనిని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఈ వెడ్డింగ్ డ్రస్‌ అద్భుతంగా ఉంది. సారాకు చక్కగా సరిపోయింది. సూపర్బ్’ అని కొందరు కామెంట్లు పెట్టగా..‘ తన అందమైన వెడ్డింగ్‌ డ్రస్‌తో ఆమె భవిష్యత్‌పై భరోసా కల్పించింది’ అని మరికొందరు రాసుకొచ్చారు.

ఇదీ చూడండి: హైదరాబాద్ కొవిడ్ రిసోర్సెస్.. గంటకు 5వేల మంది!

Last Updated : Apr 23, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.