ETV Bharat / lifestyle

నిన్న నిర్భయ.. నేడు హాథ్రస్.. కేసేదైనా పోరాటం సీమదే... - Nirbhaya case lawyer seema samridhi saha to take hathras case

ఆడపిల్ల పుట్టిందని చంపేయాలనుకున్నారు.. అమ్మాయిలకు చదువెందుకని అడుగడుగునా అడ్డగించారు.. ఆ బిడ్డే ఈ రోజు ఓ పెద్ద న్యాయవాది అయ్యింది.. ఆడపిల్లలకు జరిగిన అన్యాయంపై సివంగిలా దాడిచేస్తోంది. ఆమే సీమా సమృద్ధి కుష్వాహ.. నిన్న నిర్భయ నిందితులకు శిక్షపడేలా చేసిన ఈ న్యాయవాది. ఇప్పుడు హాథ్రస్‌ బాధితురాలి తరఫున పోరాడబోతోంది.

seema samridhi saha to take hathras case
సీమా సమృద్ధి కుష్వాహ
author img

By

Published : Oct 5, 2020, 11:49 AM IST

సీమా సమృద్ధి కుష్వాహ... 2012 వరకూ ఆడపిల్లగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికే పోరాడింది. ఆ తరువాత ఏ ఆడపిల్లకూ అన్యాయం జరగకూడదని నిర్భయ కేసుని వాదించింది. ఆ హంతకుల్ని రక్షించడానికి పేరున్న క్రిమినల్‌ లాయరు వేసిన ఎత్తులకు... పై ఎత్తులు వేస్తూ వారి ఆట కట్టించింది. అలాగని సీమ తలపండిన న్యాయవాది అనుకుంటే పొరపాటే.

అదే ఆమె తొలి కేసు. అప్పటికింకా దిల్లీ యూనివర్సిటీలో పీజీ చదువుతోంది సీమ. సివిల్స్‌ రాయాలన్నది ఆమె కల. నిర్భయ ఉదంతం జరిగిన తరువాత అందరిలాగానే ఆ వార్తను పేపరులో చదివి తెలుసుకుంది. సాటి ఆడపిల్లగా నిర్భయ అనుభవించిన నరకాన్ని తలుచుకుని రగిలిపోయింది. ఈలోగా నిర్భయ హంతకుల్ని శిక్షించాలని వేలాదిగా యువత ఇండియాగేట్‌ని చుట్టుముట్టారు. ఆ సమూహంలో సీమ ముందు వరసలో నిలబడింది. పోలీసులు నీటి ఫిరంగులను పిచికారీ చేశారు. లాఠీలు విరిగాయి. అయినా సరే అక్కడే ఉన్న పోల్‌ ఎక్కి మరీ నిర్భయకు న్యాయం జరిగేవరకూ వెనుతిరిగేది లేదని శపథం చేసింది. ఆ తరువాత నిర్భయ జ్ఞాపకార్థం జరిగిన ఓ సమావేశంలో ఆమె తల్లిని కలుసుకుంది. సాకేత్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసినప్పుడు హాజరయ్యింది. నిందితుల తరఫున ఎవరూ వాదించవద్దని ప్రతిపాదన తీసుకొచ్చింది. అలా అనడం సరికాదని తెలిసినా...ఓ ఆడకూతురికి న్యాయం జరగాలన్న ఆవేదనతోనే అలా మాట్లాడింది సీమ. అయినా ఆమెకు ఏపీ సింగ్‌ రూపంలో ఓ పెద్ద సవాల్‌ ఎదురయ్యింది.

క్రిమినల్‌ లాయర్‌గా పాతికేళ్ల అనుభవం ఉన్న సింగ్‌ నిందితుల తరఫున వాదించడానికి ముందుకొచ్చాడు. నిర్భయకు ప్రభుత్వం ఓ న్యాయవాదిని అప్పగించింది. మరుసటి ఏడాది దోషులకు జిల్లాకోర్టులో మరణశిక్ష విధించారు. కానీ అది అమలు కాలేదు నెలలు, ఏళ్లు గడిచిపోతూనే ఉన్నాయి. దాంతో నిర్భయ తల్లి ఇక తన కూతురికి న్యాయం జరగుతుందనే నమ్మకం లేదంటూ వాపోయింది. ఎంతో అనుభవమున్న క్రిమినల్‌ లాయర్లు సైతం...నిర్భయ కేసుని వాదించడానికి వెనుకంజ వేసిన సమయంలో ‘నేను పోరాడతా’ అంటూ ఆ తల్లికి ధైర్యం ఇచ్చింది సీమ. తొలికేసే అత్యున్నత న్యాయస్థానంలో వాదించాల్సి రావడం ఆమెకు సవాలే. కానీ ఎక్కడా జంకలేదు. బెదిరింపుల్ని పట్టించుకోలేదు. నిందితులకు శిక్ష పడేలా చేయగలిగింది. నిర్భయ తల్లికి మాత్రమే కాదు... ఎందరో ఆడపిల్లలకు ఊరటనిచ్చిన తీర్పు ఇది. ఇంతటి విజయాన్ని సాధించిన సీమలో అంత ధైర్యం, తెగువ ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నిస్తే తన జీవితం నుంచే అంటుందామె.

చెవిపోగులు అమ్మి చదువుకుంది..

చదువుల్లో ముందుండేది. ఆటపాటల్లో దూకుడుగా వెళ్తోన్న సీమ కాళ్లకు బంధనాలు వేయాలని ఎవరో ఒకరు తరచూ ప్రయత్నిస్తూనే ఉండేవారు. ఓసారి తనపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన ఓ అబ్బాయిపై నల్లటి రంగుని చల్లింది. అతడ్ని నిలువరించి... క్షమాపణ చెప్పేవరకూ వదిలేది లేదని హెచ్చరించింది. కాళ్లకు బుద్ధి చెప్పి పరుగులు తీశాడా కుర్రాడు. అప్పటినుంచీ పురుషాధిక్య భావజాలంపై పోరాడుతూనే ఉంది. పది పూర్తయ్యాక ఇంట్లోవాళ్లు పెళ్లి చేయాలనుకున్నారు. తాను మాత్రం పై చదువులు చదువుతానంటూ అన్నం తినకుండా నిరసన మొదలుపెట్టింది. ఆ విషయం కాస్తా పెళ్లివాళ్లకు తెలిసి అటునుంచి అటే వెళ్లిపోయారు. తానిక చదువుకోవడానికి ఎవరిమీదా ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. కాలేజీ ఫీజు చెల్లించడానికి చెవిపోగులు, కాళ్ల పట్టీలు అమ్మేసింది.

ఈ సారి ఆమె జీవితంలో పెను విషాదం. తనకెంతో మద్ధతుగా నిలిచిన తండ్రి చనిపోయాడు. అన్నలు...ఇక చదువు ఆపి పెళ్లి చేసుకోమన్నారు. కానీ సీమ స్నేహితురాలి సాయంతో ఎల్‌ఎల్‌బీలో చేరింది. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే చదువుకునేది. తిండీ, నిద్ర అన్నీ త్యాగం చేసి న్యాయవిద్య పూర్తిచేసింది. ఆపై. దిల్లీ యూనివర్శిటీలో పీజీలో చేరింది. అప్పుడే నిర్భయ సంఘటన జరిగింది. ‘నా జీవితమంతా నాకోసం నేను పోరాడాను...కానీ ఇది ఇంట్లో కూర్చుని ఏడ్చే సమయం కాదు. యుద్ధంలోకి నేరుగా దిగాల్సిన సమయం వచ్చింది అని సర్దిచెప్పుకున్నా. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా ...ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నిన్నూ వదలిపెట్టం... ఆమెకు జరిగినట్టే నీకూ జరుగుతుంది అంటూ అసహ్యంగా మాట్లాడేవారు. కానీ నేను అవేవీ పట్టించుకోదలుచుకోలేదు. నేను వాళ్లందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా...పోరాటం ఇప్పుడే మొదలయ్యింది’. అని అంటోన్న సీమ ఇప్పుడు తాజాగా హాథ్రస్‌ బాధితురాలికి న్యాయం చేసేందుకు నడుం బిగించింది. నిర్భయ కేసులో మాదిరిగానే ఈ కేసులోనూ విజయం సాధించాలని కోరుకుందాం.

మేనత్తే బతికించింది..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉగర్పూర్‌ సీమా సమృద్ధి స్వస్థలం. ఈ మధ్యకాలం వరకూ కూడా ఆ పేరుని గూగుల్‌లో వెతికినా..కనిపించనంత కుగ్రామం అది. ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో నాలుగో అమ్మాయి సీమ. ఆమె పుట్టినప్పుడు ‘మళ్లీ ఆడపిల్లే..’ అనుకుని కన్నతల్లితో సహా ఇంట్లోని పెద్దవాళ్లంతా ఆమెను చంపేయాలనుకున్నారట. కానీ నాన్న, మేనత్త అడ్డుపడటంతో సీమ బతికి బట్టకట్టింది. ఆడపిల్లకు విలువ ఇవ్వని ఆ కుటుంబంలో తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి అడుగడుగునా పోరాటం చేస్తూనే పయనించింది. అనేక ఇబ్బందుల మధ్య ఏడు వరకూ పూర్తిచేసినా...ఆ తరువాత చదువుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. కానీ ఆమె ఊరుకుంటేగా. పాఠశాలకు పంపించడానికి అన్నకు అడ్డుపడని అవాంతరాలు నాకెందుకు? అంటూ తండ్రిని నిలదీసింది. అలా ఆ ఊరి నుంచి మొదటిసారి ఎనిమిదో తరగతిలోకి అడుగుపెట్టింది సీమానే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.