చెట్లమీద పేర్లు చెక్కడం, ప్రేమ సందేశాలు రాయడం చేస్తుంటారు కొొందరు. కరీబియన్ దీవులు, హవాయి, మడగాస్కర్‌లలో ఉండే ఓ చెట్టు ఆకులపై ఏమైనా రాస్తే అది చాలా కాలం పాటు అలాగే కనిపిస్తుందట. ఆటో గ్రాఫ్ ట్రీ పేరుతో పిలుచుకునే ఈ చెట్టు ఆకులు పెద్దగా, గట్టిగా, మందంగా ఉంటాయట.
అంతేకాదు, పదునుగా ఉండే సూది, రీఫిల్ లాంటి వాటితో ఈ ఆకుల మీద ఏమైనా రాస్తే అది చాలా కాలం పాటు- అంటే, ఆ ఆకు ఉన్నంత కాలం అలాగే కనిపిస్తుందట. అందుకే, ఈ మొక్కల్ని ఆటోగ్రాఫ్ ట్రీ, సిగ్నేచర్ ట్రీ అంటారు. వీటి పువ్వులు కూడా పరిమళాల్ని వెదజల్లుతాయి, చూడ్డానికీ బాగుంటాయి కాబట్టి ఈ మొక్కల ఆకుల మీద రకరకాల సందేశాలను రాసి ఆత్మీయులకు కానుకగా ఇస్తుంటారు. ఇది ఇంట్లో ఉంటే ప్రియమైనవారికి అప్పుడప్పుడూ ఆకు సందేశాలు కూడా ఇవ్వొచ్చన్నమాట.
- ఇదీ చూడండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సునీల్