ETV Bharat / jagte-raho

'రాజ్​కుమార్​ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే'

రాజ్‌కుమార్‌ది ప్రభుత్వ హత్యేనని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందడంపై ఆయన స్పందించారు.

'రాజ్​కుమార్​ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే'
'రాజ్​కుమార్​ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే'
author img

By

Published : Oct 12, 2020, 6:48 AM IST

Updated : Oct 12, 2020, 12:58 PM IST

ముషీరాబాద్‌ నియోజకవర్గం రాంనగర్‌ డివిజన్‌లో శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లో చనిపోయిన రాజ్‌కుమార్‌ది ప్రభుత్వ హత్యేనని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. అపార్టుమెంటులోకి భారీగా వరద నీరు వచ్చిన సమయంలోనే రాజ్‌కుమార్‌ పాల్‌ప్యాకెట్‌ కోసం కిందకొచ్చారని... నీళ్లలో కాలు పెట్టగానే విద్యుదాఘాతంతో చనిపోయారని పేర్కొన్నారు.

నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వరదనీరు నిలవకుండా చర్యలు తీసుకోవడంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ పార్టీ సమావేశానికి వస్తున్నట్లు తెలుసుకుని ఆయనను అడ్డుకున్నట్లు తెలిపారు.

చనిపోయిన రాజ్‌కుమార్‌ కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని, రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో తెరాస. కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

ఇవీ చూడండి: 'సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోకూడదో చూపిస్తున్న కేంద్రం'

Last Updated : Oct 12, 2020, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.