సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందింది. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఈనెల 15వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అతని కుటుంబ సభ్యులు చాలాచోట్ల వెతికినా కనిపించకపోవటంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు కూడా అతడి కోసం వెతుకుతున్నారు.
కుంటలో మృతదేహాం..
ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో లక్డారం గ్రామ శివారులోని గుర్రాలోళ్ల కుంటలో ఒక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ మృతదేహం శ్రీకాంత్దేనని గుర్తించారు. కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో కుంటలో పడి చనిపోయాడా..? లేక ఎవరైనా హత్య చేసి కుంటలో పడేశారా..?అనే కోణంలో పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇంటి సమీపంలోని కొంత మందితో శ్రీకాంత్ గొడవ పడటంతో వారిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఒకరనుకొని మరొకరిపై కత్తితో దాడి.. చివరికి..!