యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి పంచాయతీలో వరుస ఆత్మహత్యలు విషాదం నింపుతున్నాయి. శనివారం రోజు ఓ యువకుడు చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా... అదే తరహాలో మరో ఘటన చోటుచోసుకుంది. ఆవాస గ్రామమైన మధిరలో చిట్టమైన శ్రీకాంత్ అనే యువకుడు తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు.
చిట్టమైన శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం బోర్‌వెల్స్ వాహనంపై పని చేయగా... ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం వెళ్లిన శ్రీకాంత్... చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విగతజీవిగా వేలాడుతున్న శ్రీకాంత్‌ను చూసిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
అప్పటివరకు వ్యవసాయపనులు చేసుకుంటున్నాడనుకున్న కుటుంబసభ్యులకు... కుమారుని మరణ వార్త విని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకుని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.