బతుకమ్మ ఆడి పాడిన అనంతరం ఇంటికి చేరుకునే క్రమంలో పందిరి వరలక్ష్మి (30) గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట గ్రామంలో జరిగింది. పండుగ రోజు ఆ ఇంటితో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు నెలకొన్నాయి.
ఉదయం నుంచి ఎంతో భక్తితో బతుకమ్మలను పేర్చింది. సాయంత్రం పూట అందరితో కలిసి బతుకమ్మ ఆడి పాడింది. గుండెపోటు రావడంతో ఆమెకు అదే చివరి బతుకమ్మ అయింది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కంటనీరు పెట్టించింది. వరలక్ష్మికి ఒక బాబు, పాప ఉన్నారు.
ఇదీ చూడండి: నీట్లో తెలుగు విద్యార్థుల సత్తా.. హైదరాబాద్ విద్యార్థినికి మూడో ర్యాంక్