ఏపీలోని శ్రీ హరికోటలోని షార్‌లో సీనియర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న వాసంతి(55)... కుమార్తె చదువు కోసం తిరుపతిలోని శ్రీనివాసం సముదాయం వెనుక అద్దెకు దిగారు. అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్న వాసంతి.. లిఫ్ట్ బటన్ నొక్కారు. వెంటనే లిఫ్టుకు ఉండే గ్రిల్స్ తెరుచుకున్నాయి. లిఫ్టు వచ్చిందేమోనని ఆమె అడుగేశారు. అంతే కిందకి జారిపడ్డారు. లిఫ్ట్ బాక్స్ పై పడి, తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు చూసి వాసంతిని తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అపార్ట్మెంట్లో లిఫ్ట్ పనితీరు సరిగా లేదని ఫిర్యాదు చేసినా యజమాని పట్టించుకోలేదని మృతురాలి భర్త సురేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తిరుపతి తూర్పు పోలీసులు అపార్ట్మెంట్ యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మైనర్‌తో వృద్ధుడి వివాహం కేసులో ఆరుగురు అరెస్ట్