ETV Bharat / jagte-raho

వీడిన హత్య మిస్టరీ... ప్రియునితో కలిసి భార్యే చంపించింది! - chandrayangutta news

హైదరాబాద్ పాతబస్తీ ఇంద్రానగర్​లో ఈ నెల 18న జరిగిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేధించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మృతుని భార్య.. ఆ వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

wife murdered husband in old city
wife murdered husband in old city
author img

By

Published : Oct 20, 2020, 6:44 PM IST

హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట ఠాణా పరిధిలోని ఇంద్రానగర్​లో ఈ నెల 18న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. నసీర్ అనే వ్యక్తి తన భార్య హలీమా, పిల్లలతో కలిసి ఇంద్రానగర్​లో ఉంటూ పెట్రోల్ పంపులో పనిచేసేవాడు. ఈ నెల 18న నసీర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో మృతుడి భార్య హలీమనే... వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు వెల్లడైంది. హలీమ, బిలాలా హుస్సేన్​ కలిసి నసీర్​ ముఖంపై దిండు పెట్టి ఉపిరాడనివ్వకుండా చేశారు. రుమాలుతో గొంతుకు ఉరేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు పాల్పడ్డ హాలీమా, బిలాల్ హుస్సేన్​ను చంద్రాయన్​గుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: మృత్యువుతో పసికందు పోరాటం... ఆదుకోవాలని విన్నపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.