ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి వరంగల్ అర్బన్ జిల్లా పున్నెల్ మలుపు వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తోన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆపస్మారక స్థితిలో పడిఉన్న క్షతగాత్రును చూసి వారి వద్దకు వెళ్లారు. గాయాలను పరిశీలించి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
ఎమ్మెల్యే చొరవతో త్వరితగతిన స్పందించిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.
ఇదీ చదవండి : 'అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి'