ETV Bharat / jagte-raho

కొత్త ఆటో కొనుక్కుందామనే హత్య చేశాడు: ఇంఛార్జ్​ ఏసీపీ

సాహెబ్​ నగర్​ మైసమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించి.. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మైసమ్మను చంపి నగలు దొంగలించి కొత్త ఆటోను కొనుక్కోవడమే నిందితుడి ఉద్దేశమని వనస్థలిపురం ఇంఛార్జ్​ ఏసీపీ శంకర్​ వెల్లడించారు.

కొత్త ఆటో కొనుక్కుందామనే హత్య చేశాడు: ఇంఛార్జ్​ ఏసీపీ
కొత్త ఆటో కొనుక్కుందామనే హత్య చేశాడు: ఇంఛార్జ్​ ఏసీపీ
author img

By

Published : Sep 30, 2020, 10:08 PM IST

హైదరాబాద్ వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ మైసమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన 3.5 తులాల బంగారు, 103 తులాల వెండి అభరణాలు, రూ. 36 వేల నగదు, ఆటో, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాహేబ్ నగర్​కు చెందిన మైసమ్మ స్థానిక శ్మశానవాటికలో పనిచేస్తుంది. అయితే ఆ ఇంటిపక్కనే ఉంటున్న సతీశ్​ ఆటోలో పలుమార్లు శ్మశానవాటిక వద్దకు వేళ్లేవాడు.

అయితే ఎలాగైనా మైసమ్మను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు అమ్మి కొత్త ఆటో కొనుక్కోవాలనుకున్నట్లు సతీశ్​ భావించినట్లు వనస్థలిపురం ఇంఛార్జ్​ ఏసీపీ శంకర్​ తెలిపారు. పథకం ప్రకారమే మైసమ్మకు కల్లు తాగించి.. అనంతరం ఆటోలో తీసుకెళ్లి కొహెడ సమీపంలో కత్తితో మెడకోసి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాళ్లకు ఉన్న వెండి కడియాలు రాకపోవడం వల్ల కాళ్లు నరికి తీసుకొని.. తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు శంకర్​ వివరించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: తలపై బండరాయితో మోది హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.