పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామానికి చెందిన శోభ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఉడుత రాయమల్లు చిన్న కుమార్తె శోభ (30)కు అదే గ్రామానికి చెందిన కుమార్తో 13 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు. చాలా రోజుల నుంచి కుమార్ తాగుడుకు బానిసై శోభను శారీరకంగా, మానసికంగా అతని తల్లి మల్లమ్మతో కలిసి చిత్రహింసలు పెడుతున్నారు.
కాగా వారి వేధింపులు భరించలేక శోభ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. మృతురాలి తండ్రి రాయమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రామగిరి ఎస్సై మహేందర్ తెలిపారు.
ఇవీచూడండి : రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక