నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మిత్రులు గల్లంతు అయ్యారు. కందకుర్తికి చెందిన కందరే ప్రవీణ్, మహారాష్ట్ర సామ్రాన్కు చెందిన పరుశురాంగా వీరిద్దరిని గుర్తించారు. మద్యం సేవించిన అనంతరం ప్రవీణ్ గోదావరి నదిలోకి దిగడంతో.. అతని కోసం స్నేహితుడు పరుశురాం కూడా దూకాడు. ఇద్దరు నీటిలో మునిగారు.
గల్లంతైన ఇద్దరు మిత్రుల కోసం జాలరులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు గోదావరిలో గల్లంతు కావడంతో గ్రామస్థులంతా మధ్యాహ్నం నుంచి మృతదేహల కోసం ఎదురుచూస్తున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువులు ఘటన స్థలంలో బోరున విలపిస్తున్నారు.
ఇవీ చూడండి: 'సొంతంగానే మెజార్టీ సాధిస్తాం- సుస్థిర పాలన అందిస్తాం'