ETV Bharat / jagte-raho

దైవదర్శనానికి వెళ్లి వస్తూ...తిరిగిరాని లోకాలకు

ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్​ జిల్లా సారంగపూర్ మండలకేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

author img

By

Published : Dec 6, 2020, 10:10 PM IST

two wheeler attack lorry one person died on the spot
దైవదర్శనానికి వెళ్లి వస్తూ...తిరిగిరాని లోకాలకు

నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్​ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కుంటాల మండలం సూర్యాపూర్ గ్రామానికి చెందిన శీలా సాయినాథ్, మిత్రుడు రొడ్డ సాయినాథ్​తో కలిసి ద్విచక్రవాహనంపై అడెల్లి పోచమ్మదేవి ఆలయానికి వెళ్లారు.

అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో శీలా సాయినాథ్(27) అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న రొడ్డ సాయినాథ్​ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతుగాత్రున్ని 108 వాహనంలో నిర్మల్​ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతనికి భార్య, కూతురు ఉన్నట్లు తెలిపారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి:కొడుకులు చూస్తుండగానే తల్లి ఆత్మహత్య... కారణమేంటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.