మంగళవారం రాత్రి శ్రీశైలం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద ఓ వ్యాన్ సుమారు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు కాగా... వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.
మృతులు నీతూ భాయ్, రాజకుమారి భాయ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా... బాధితులు హైదరాబాద్‌లోని దూల్‌పేట్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో లోయలో పడిన వ్యాను.. 10మందికి గాయాలు