మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పలు గ్రామాల్లో అక్రమ గుడుంబా స్థావరాలపై తొర్రూరు ఆబ్కారీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గుడుంబా, బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ధ్వంసం..
మండలంలో ఉగ్గంపల్లి, బక్కతండా, దుమ్డాతండాల్లో ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఐదు లీటర్ల గుడుంబా, 800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సారాయి తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: ఉరి వేసుకొని.. జీహెచ్‌ఎంసీ స్వీపర్ ఆత్మహత్య