ETV Bharat / jagte-raho

మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి... ఇద్దరికి గాయాలు - నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షం

మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి... ఇద్దరికి గాయాలు

author img

By

Published : Oct 14, 2020, 8:24 AM IST

Updated : Oct 14, 2020, 9:49 AM IST

08:22 October 14

మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి... ఇద్దరికి గాయాలు

మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి... ఇద్దరికి గాయాలు

     ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రాత్రి 2 గంటల ప్రాంతంలో మట్టి మిద్దె కూలి ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురిపై పడింది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు గాయపడగా వారిని నాగర్​ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

    ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం వల్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతి చెందిన వారిలో కొండా హనుమంత్ రెడ్డి(70), ఆయన భార్య కొండ అనసూయమ్మ(50), మనవడు హర్షవర్ధన్ రెడ్డి (12) ఉన్నారు. వీరంతా ఒకే గదిలో నిద్రపోయినప్పుడు ఘటన జరిగింది. 

 ఇదీ చదవండి:  కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

Last Updated : Oct 14, 2020, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.