ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస సమీప జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ....బొలెరో వాహనం ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా... మరొకరు శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు.
- ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి