ETV Bharat / jagte-raho

మరో ముగ్గురు అరెస్ట్

ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని ఇవాళ అరెస్ట్​ చేశారు. శిఖా చౌదరి పాత్రపై పూర్తి విచారణ అనంతరం చెబుతామని డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు.

పోలీసుల పాత్రేంటి..?
author img

By

Published : Feb 26, 2019, 7:59 PM IST

Updated : Feb 26, 2019, 9:46 PM IST

మరో ముగ్గురు అరెస్ట్
రోజుకో మలుపు తిరిగిన చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్య సమయంలో తీసిన వీడియో, ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధం ఉన్న నగేశ్​, విశాల్​, లక్ష్మిరెడ్డి సుభాష్​ చంద్రారెడ్డిని అరెస్ట్​ చేశారు.

'హత్య'కు పథకం

జయరాం హత్యకు జనవరి 29న పథకం రూపొందించినట్టు పోలీసులు గుర్తించారు. మొదట జయరాంను కిడ్నాప్​ చేశారు. బెదిరించి, కొట్టి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. భయపడిన చిగురుపాటి డబ్బు కోసం దాదాపు 10 మందికి ఫోన్​ చేశారు. ఒకరు స్పందించి రూ.6లక్షలు పంపించారు. తీసుకోవడానికి నిందితులు దస్పల్లా హోటల్​కు వచ్చారు. అనంతరం హత్య చేశారు.

'పోలీసుల' పాత్ర
జయరాం కేసులో పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరుగుతోంది. ఏసీపీ మల్లారెడ్డి, గోవింద్​ రెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాసులు, రాయదుర్గం సీఐ రాంబాబు, జూబ్లీహిల్స్​ సీఐ హరిశ్చంద్రారెడ్డిలను ప్రశ్నించినట్టు డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. వీరికి కేసుతో సంబంధం ఉంటే సీపీ చర్యలు తీసుకుంటారని ప్రకటించారు.

శిఖా చౌదరి ఊసేది
శిఖా చౌదరిపై రాకేశ్​ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చేయలేదని డీసీపీ తెలిపారు. ఆమెపై రాకేశ్ రెడ్డి ఖర్చుచేసిన రూ.1.5 కోట్లను చెల్లిస్తానని జయరాం ఒప్పుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పూర్తి దర్యాప్తు తర్వాతే శిఖాచౌదరి పాత్రపై వివరణ ఇస్తామని విచారణ అధికారి తెలిపారు.

ఇవీ చదవండి:కారులో మంటలు

Note: Script Ftp
Last Updated : Feb 26, 2019, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.