జగిత్యాల జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓ ఇంట్లో చొరబడ్డారు. ఎనుగందుల దశరథ్ గౌడ్ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సామాగ్రి అంతా చిందరవందర చేశారు. బీరువాలను పగలగొట్టి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మణికట్టు నరం కోసి... కోస్గిలో వ్యక్తి దారుణ హత్య!