ETV Bharat / jagte-raho

జల్లేరు వాగులో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం

author img

By

Published : Jul 14, 2020, 8:44 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడులోని జల్లేరు వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయారు. స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఫలితంగా కలెక్టర్​ ఆదేశాల మేరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

The person was lost in the stream of Jalleru in badradri
జల్లేరు వాగులో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలంలోని మర్కోడులో సోమవారం భారీ వర్షం కురిసింది. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గ్రామ సమీపంలోని జల్లేరు వాగులో నీటి ప్రవాహం పెరగడం వల్ల లింగయ్య అనే ఓ వ్యక్తి కొట్టుకుపోయారు.

బోడయికుంట గ్రామానికి చెందిన లింగయ్య.. నిత్యావసరాల కొనుగోలు కోసం మర్కోడు గ్రామానికి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో వాగు దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరిగి.. కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు లింగయ్య ఆచూకీ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది.

విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఘటనపై ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. లింగయ్య ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదీచూడండి: సచివాలయం కూల్చివేతపై మంత్రివర్గ తీర్మానం ఎక్కడ..: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.