ETV Bharat / jagte-raho

తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా " - sumedha died story

మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌లో గురువారం సాయంత్రం అదృశ్యమైన సుమేధ ఘటన...విషాదంగా ముగిసింది. సరదాగా ఆడుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక... నాలాలో పడి చెరువులో శవమై తేలింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురిని నిర్జీవంగా చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిచారు.

sumedha died drown in nala full story
sumedha died drown in nala full story
author img

By

Published : Sep 18, 2020, 10:41 PM IST

తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "

"ఆడుకుని వస్తానమ్మా..." అంటూ ఇంట్లోంచి వెళ్లిన ఒక్కగానొక్క కూతురు... చెరువులో విగతజీవిగా తేలడం... నేరేడ్‌మెట్‌లోని అభిజిత్‌ కపూరియా దంపతులకు గర్భశోకాన్ని మిగిల్చింది. పంజాబ్​కి చెందిన అబిజిత్ కపూరియా కుటుంబం 2007లో నగరానికి వచ్చారు. అభిజిత్‌ దంపతులకు 12ఏళ్ళ సుమేద ఒక్కతే కూతురు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గతంలో మల్కాజిగిరిలోని వేరే ప్రాంతంలో అద్దెకు ఉన్న కుటుంబం... రెండు నెలల క్రితమే దీన్ దయాల్ నగర్‌కు వచ్చారు.

రోజూ లాగానే ఆన్‌లైన్‌ తరగతి పూర్తవగానే తన తల్లికి చెప్పి సైకిల్ తీసుకుని సుమేధ బయటకు వెళ్లింది. పక్కింట్లో తన స్నేహితురాలిని పలకరించింది. ఆ తర్వాత ఎంతకూ తిరిగి రాకపోవటం వల్ల అంతటా తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎక్కడా కన్పించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తెరిచిఉంచిన నాలానే బాలిక ప్రాణాన్ని బలితీసుకుందని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

చేయి కూడా చేసుకోలేదు...

"కేవలం కొంతమంది నిర్లక్ష్యం వల్ల చిన్నపాప ఎంతో బాధను అనుభవిస్తూ చనిపోవాల్సివచ్చింది. నేనెప్పుడూ కనీసం చేయి కూడా చేసుకోలేదు . అలాంటిది ఎంతో నొప్పిని భరిస్తూ ప్రాణం వదిలింది. ప్రమాదవశాత్తే జరిగి ఉండొచ్చు. కానీ.. అందుకు కారణమేంటి?. ఈ తరహా ప్రమాదాలేం కొత్తవి కావు ఏటా జరుగుతూనే ఉంటాయి. కొంతమంది బతుకుతారు నా బిడ్డ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది" అంటూ సుమేధ తండ్రి చేసిన వ్యాఖ్యలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

నాలాలో పడి చెరువులో తేలింది...

సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నాలాలో సైకిల్‌ దొరికింది. బాలిక సైతం నాలాలో కొట్టుకుపోయి ఉంటుందని ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలతో నాలాను జల్లెడపట్టారు. ఎలాంటి జాడ లభించకపోవడం వల్ల... నాలా కలిసే బండ చెరువు వద్ద గాలింపు చేపట్టారు. అక్కడ స్థానికులు చెరువులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహన్ని వెలికితీసి సుమేధగా గుర్తించారు.

20 ఏళ్లుగా నాలా సమస్య...

20 ఏళ్ళుగా నాలా సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానికులు... ఈ ఘటతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని...గతంలో భరత్ నగర్ ప్రాంతంలోనూ నాలాలో పడి ఓ చిన్నారి మృతి చెందిందని స్థానికులు వాపోయారు. ప్రమాదం జరిగినపుడు మాత్రమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇప్పటికైనా నాలాల సమస్యలు పరిష్కరించకుంటే మరెన్నో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: నేరెడ్‌మెట్‌ బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.