ETV Bharat / jagte-raho

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య - ఆత్మహత్యలు

రోజులాగే ఉద్యోగానికి వెళ్లిన ఓ యువకుడు​ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఎవరులేని సమయం చూసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో చోటు చేసుకుంది.

Suicide of a young man in yadadri district
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
author img

By

Published : Jan 29, 2021, 10:04 AM IST

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరిపడిగా గ్రామానికి చెందిన ఉడుత హరీశ్​ (24) గత కొంత కాలంగా జనగామ జిల్లా దేవరుప్పులలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో పని చేస్తున్నాడు.

రోజులాగే ఉద్యోగానికి వెళ్లిన హరీశ్​.. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరులేని సమయం చూసి.. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కుమారుడి మరణాన్ని చూసి.. తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడు గత కొంత కాలంగా దేవరుప్పులకు చెందిన ఓ యువతితో చనువుగా ఉంటున్నాడని.. అతడి తండ్రి, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు​మార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: కొన ఊపిరితో కొట్టుకుంటుంటే ఏటీఎం పిన్ అడిగాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.