ETV Bharat / jagte-raho

న్యాయం చేయాలంటూ.. కలెక్టర్​ ముందే ఆత్మహత్యాయత్నం - జనగామ జిల్లా కలెక్టర్ తాజా వార్తలు

తమ ఎకరంన్నర వ్యవసాయ భూమిలో వేసుకున్న కందిపంటను రాత్రికి రాత్రే తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. కంది మొక్కలతో బాధితులు కలెక్టరేట్​కు చేరుకున్నారు. పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరేట్​లో చోటుచేసుకుంది.

SUICIDE ATTEMPT AT COLLECTORAE IN  JANGOAN DISTRICT
న్యాయం చేయాలంటూ.. కలెక్టర్​ ముందే ఆత్మాహత్యాయత్నం
author img

By

Published : Oct 2, 2020, 9:47 PM IST

జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామం ఆర్టీసీ కాలనీకి చెందిన కొమ్మరాజుల యాదగిరి బైపాస్​ రోడ్డులో ఎకరంన్నర భూమిని ఆరుగురు బిడ్డలకు గిఫ్ట్​ రిజిస్ట్రేషన్​ చేయించాడు.

అదే గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మి తప్పుడు పత్రాలను సృష్టించి తమ భూమిపై పెత్తనం చెలాయిస్తుందని వాపోయారు. ఈ విషయంపై గతంలో కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పును ఇచ్చిందని పేర్కొన్నారు. దాంతో ఆ భూమిలో కంది పంటను వేసుకున్నామని తెలిపారు.

పంట చేతి కందే సమయంలో శివరాత్రి లక్ష్మి, ఆమె అల్లుడు రాత్రికి రాత్రే పది మంది వ్యక్తులతో పంటను పూర్తిగా తొలగించారని తమకు న్యాయం చేయాలనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని పేర్కొన్నారు. కలెక్టరేట్​లోనే ఉన్న కలెక్టర్ నిఖిల బయటకు వచ్చి బాధితులతో మాట్లాడింది. ఆర్టీవో వచ్చి సమస్యలు పరిష్కరిస్తాడని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.