ETV Bharat / jagte-raho

ఇల్లొదిలి వెళ్లిపోయిన విద్యార్థిని.. ఆందోళనలో తల్లిదండ్రులు

తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థిని ఇల్లు వదిలి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాద్​లో జరిగింది. ల్యాబ్​ పరీక్ష ఉందని చెప్పి బయటికి వెళ్లిన ఆమె సాయంత్రమైనా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Jan 6, 2021, 1:27 PM IST

student escape from her house in hyderabad
ఇల్లొదిలి వెళ్లిపోయిన విద్యార్థిని.. ఆందోళనలో తల్లిదండ్రులు

కుటుంబ సభ్యులు మందలించడంతో కీర్తి అనే విద్యార్థిని ఇంటి నుంచి పారిపోయిన సంఘటన హైదరాబాద్​లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారంనాడు ల్యాబ్​ పరీక్ష ఉందని చెప్పండంతో కీర్తి సోదరి దీక్షిత ఆమెను బస్​స్టాప్​లో వదిలివెళ్లిందని పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్​లోని బాలాజీ నగర్​లో నివాసం ఉంటున్న కీర్తి నగరంలోని బాజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. రెండు రోజులుగా ఆమె సోషల్ మీడియాలోనే అధిక సమయం గడుపుతుండడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆమె సోదరి దీక్షిత కూడా మందలించింది. అవమానంగా భావించిన కీర్తి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రమైనా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జవహర్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీర్తి చరవాణి ప్రస్తుతం పని చేస్తున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: 7 దశాబ్దాల క్రితం.. పోలీసుల పని తీరు ఎలా ఉండేదో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.