వరంగల్లోని ఖిలా వరంగల్ పడమరకోటకు చెందిన రాజేందర్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం తల్లితో తరచుగా గొడవ పడేవాడు. ఈ క్రమంలో తల్లికి కుమారునికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన తల్లి నిద్రమత్తులో ఉన్న కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.
రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన సోదరుడు ఎలా మృతి చెందాడని తెలుసుకునేందుకు తమ్ముడు మిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. వేధింపులు తాళలేక రాజేందర్ హత్య చేసినట్లు తల్లి ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య