మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తల్లితో కలిసి కన్న తండ్రినే హత్యచేశారు. వివరాల్లోకి వెళ్తే... సింగరేణి కార్మికుడు ముత్తెశంకర్ (57) కుటుంబ కలహాలతో మూడు నెలలుగా ఇంటికి దూరంగా మంచిర్యాలలో ఉంటున్నాడు. అయితే చిన్న కుమార్తె స్వాతి కరోనా బారిన పడినట్లు, కుమారుడు శ్రావణ్ కుమార్‌కు లక్షణాలున్నాయని ఆయన భార్య విజయ శంకర్‌కు గురువారం ఫోన్‌చేసి చెప్పింది. దీనితో ఆయన శుక్రవారం గ్రామానికి వచ్చారు.
అదేరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో భార్య, కుమార్తె, కుమారుడు కలిసి ఆయన గొంతుకు వైరుబిగించి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతుడి మెడకు చీరను కట్టారు. కారుణ్య నియామకంతో ఉద్యోగం సాధించవచ్చని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేశారని పోలీసులు భావిస్తున్నారు. శంకర్ చెల్లెలు రుక్మిణి ఫిర్యాదు మేరకు మృతుడి భార్య, కుమార్తె, కుమారుడుపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి సీఐ జగదీశ్ తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్ రెడ్డి సమీక్ష