ETV Bharat / jagte-raho

చితకబాదారు: ఉద్యోగస్తులపై కార్పొరేట్ సంస్థ పైశాచికత్వం

కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న పాపానికి ప్రాణం పోయే పరిస్థితి తలెత్తింది. లావాదేవీల్లో తేడా జరిగిందనే నెపంతో ఉద్యోగులను చితకబాదిన ఘటన హైదరాబాద్​లోని కుషాయిగూడలో జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

shop owners attack on employees at asrao nagar in hyderabad
ఉద్యోగస్తులపై కార్పొరేట్ సంస్థ పైశాచికత్వం
author img

By

Published : Jun 25, 2020, 7:46 PM IST

హైదరాబాద్​లో పేరొందిన క్లాత్ షోరూంలో పనిచేస్తున్న సంపత్, భాను చందర్​ను యజమానులు చితకబాదారు. విచక్షణ రహితంగా కొట్టడం వల్ల తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులు ఉప్పల్​​లోని షోరూంలో ఫ్లోర్ ఇంచార్జ్, క్యాష్యర్​గా పని చేస్తున్నారు.

అకౌంట్లో తేడా వచ్చిందనే నెపంతో వారిని ఏఎస్​ రావు నగర్​ తీసుకెళ్లి చేతులు వెనక్కి కట్టి ఇనుప రాడ్లు, కర్రలతో ప్రాణాలు పోయేలా కొట్టారు. సంపత్, భాను చందర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానులైన పులవర్తి నాగేశ్వరరావు, పులవర్తి రాజశేఖర్, పులవర్తి రామకృష్ణ రావును కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.

ఉద్యోగస్తులపై కార్పొరేట్ సంస్థ పైశాచికత్వం

ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.