హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... బాధితుడిని సురక్షితంగా కాపాడి బంధువులకు అప్పగించినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్కుల కాలనీలో నాగభూషణం అనే వ్యాపారిని.. సోమవారం సాయంత్రం 4 గంటలకు అజీజ్ గ్యాంగ్ సభ్యులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనను ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. రాజ్‌భూషణ్ అనే వ్యక్తితో ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ జరిగిందని వెల్లడించారు. రాజ్‌భూషణ్ ఆదేశాలతోనే కిడ్నాప్ చేసి డబ్బును డిమాండ్ చేశారని బాధితుడు వాపోయాడు.
జగిత్యాల పోలీసుల సహకారంతో సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాపర్లను గుర్తించి... వెంటనే వారిని అరెస్టు చేసి బాధితుడిని రక్షించినట్లు సీపీ పేర్కొన్నారు. రాజ్‌భూషణ్ కిడ్నాప్ చేయించినట్లు గుర్తించామని తెలిపారు. అజీజ్ గ్యాంగ్‌తో 10 లక్షలు సుపారి మాట్లాడుకొని కిడ్నాప్ చేయించాడని సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్ భగవత్ తెలిపారు.
ఇదీ చూడండి: సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ... నేపాల్ గ్యాంగ్ చోరీల మిస్టరీ