హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ప్రైవేట్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాలుగు రోజుల నుంచి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 బస్సులను సీజ్ చేశారు. మరో ఆరు బస్సులపై కేసు నమోదు చేశారు. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద కూడా అధికారులు తనిఖీలు చేశారు. ప్రైవేటు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్