ETV Bharat / jagte-raho

కార్పొరేషన్​ కార్యాలయంలో చోరీ.. రూ.63వేలు అపహరణ

సికింద్రాబాద్​ జవహర్​ నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయంలో చోరీ జరిగింది. డీఈ కృష్ణ క్యాబిన్​లో రూ.63 వేల నగదు అపహరణకు గురైనట్టు అధికారులు తెలిపారు. కార్యాలయం సిబ్బందే దొంగతనానికి పాల్పడ్డారా.. వేరే ఎవరైనా దొంగతనం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

robbery in javahar nagar municipality corporation office
కార్పొరేషన్​ కార్యాలయంలో చోరీ.. రూ.63వేలు అపహరణ
author img

By

Published : Oct 10, 2020, 3:13 PM IST

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా సికింద్రాబాద్​ పరిధిలోని జవహర్​ నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయంలో చోరీ జరిగింది. డీఈ కృష్ణ క్యాబిన్లో దాదాపు రూ.63 వేల నగదు అపహరణకు గురైనట్టు అధికారులు తెలిపారు. ఎప్పట్లాగే కార్యాలయానికి వచ్చిన సిబ్బంది తలుపులు తెరిచి చూడగా.. డీఈ కృష్ణ గదిలోని లాకర్​ తెరిచి ఉండటం గమనించారు. అనుమానం వచ్చి పరిశీలించగా.. అందులో ప్రభుత్వానికి చెందిన రూ.63 వేలు కనిపించలేదు. నగదుతో పాటు.. ఏవైనా కీలక దస్త్రాలు అపహరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మున్సిపల్​ కార్యాలయంలో చోరీ జరగడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయ సిబ్బందే దొంగతనం చేశారా.. లేక ఇంకెవరైనా చోరీకి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. కార్యాలయం ఆవరణలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: ఒకే​ జిల్లాలో ఒకే రోజు 5 మిస్సింగ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.