దైవదర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్న భక్తులను లారీ మృత్యురూపంలో వచ్చి కాటేసింది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు పిల్లలు సహా 12 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడినవారిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు:
వేమిరెడ్డి ఉదయ్ (6)
పూడూరు ఉపేందర్‌రెడ్డి(15)
గూడూరు సూర్యనారాయణరెడ్డి (46)
వేమిరెడ్డి పద్మావతి (45)
లక్కిరెడ్డి అప్పమ్మ
అక్కమ్మ (45)
లక్కిరెడ్డి తిరుపతమ్మ (60)
గూడూరు రమణమ్మ (45)
వేమిరెడ్డి భారతమ్మ (70)
రాజి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరానికి చెందిన 26 మంది భక్తులు... వేదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరిగు ప్రయాణంలో... వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను సిమెంట్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపక్కకు పడిపోయి... పిల్లలు, మహిళలు సహా 12 మంది చనిపోయారు.
లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. ట్రాక్టర్‌ను ఢీకొన్న అనంతరం లారీ సైతం రోడ్డుపక్కకు దూసుకుపోవడం వల్ల డ్రైవర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలకు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తిరగబెట్టిన శస్త్రచికిత్స గాయం